Sarah Sanders
-
ట్రంప్ కోసం పనిచేస్తున్నావా.. వెళ్లిపో!
సాక్షి, వాషింగ్టన్ : వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ సారా హకాబీ సాండర్స్‌కు ఓ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేస్తున్నందుకు ఆమె పట్ల రెస్టారెంట్ యజమాని దురుసుగా ప్రవర్తించారు. ఆమెను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమ్మని గద్దించారు. ఈ విషయాన్ని సారా ట్విట్టర్లో ధ్రువీకరించారు. ట్రంప్ కోసం పనిచేస్తున్నావా? అయితే, వెళ్లిపో అంటూ రెస్టారెంట్ ఓనర్ తనతో పేర్కొన్నట్టు ఆమె తెలిపారు. వర్జీనియా లెక్సింగ్టన్లోని ద రెడ్హెన్ రెస్టారెంట్లో శుక్రవారం ఈ ఘటన జరిగిందని తెలిపారు. యజమాని వెళ్లిపోమ్మని చెప్పడంతో తాను అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చానని ఆమె తెలిపారు. ఈ ఘటన తనను పెద్దగా బాధపెట్టకపోయినప్పటికీ.. రెస్టారెంట్ ఓనర్ స్వభావాన్ని మాత్రం బయటపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ‘ప్రజలతో నేను ఎప్పుడూ సమున్నతంగా నడుచుకుంటాను. నాతో విభేదించే వారిని కూడా గౌరవిస్తాను. నా తీరులో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఆమె పేర్కొన్నారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఆమె చేసిన ఈ ట్వీట్‌కు 22వేలకుపైగా రిప్లైస్ వచ్చాయి. సారాకు అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా కామెంట్లు చేస్తున్నారు. సారా తండ్రి, అర్కాన్సా మాజీ గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మైక్ హకబీ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. -
‘అమెరికాను బెదిరిస్తున్నారు’
వాషింగ్టన్: తరచూ అమెరికాను బెదిరిస్తోన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై యూఎస్ విరుచుకుపడింది. ‘తన డెస్క్ పైనే అణు బాంబు బటన్ ఉంటుందం’టూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న కిమ్ మానసిక పరిస్థితిని అమెరికా అధ్యక్ష భవనం అధికారులు ప్రశ్నించారు. ఈమేరకు గురువారం అమెరికా అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి శారా సాండర్స్ విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ..‘‘గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తరచూ అణు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాను బెదిరిస్తున్నారు. ఇలా పదే పదే బెదిరింపులకు పాల్పడటం అతని మానసిక స్థితి లేమిని తెలియజేస్తోంద’’ని అన్నారు. కిమ్‌కు వ్యాఖ్యలకు ధీటుగా ‘‘అణుబాంబు బటన్ నా టేబుల్ వద్దా ఉంది. అది మీ కంటే ఎక్కువ శక్తివంతమైనది, పెద్దది కూడా. అది బాగా పనిచేస్తుంది’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌ను ఉద్దేశించి అమెరికా రాజకీయ విశ్లేషకులు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. ట్రంప్‌కు మతిస్థిమితం లేదంటూ వస్తోన్న విమర్శలపై సాండర్స్ వివరణ ఇచ్చారు. ‘‘అమెరికా ప్రజల పరిరక్షణకు, దేశ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ట్రంప్ వెనకడుగు వేసే పరిస్థితి లేద’’ని ఆమె స్పష్టం చేశారు. సీనియర్ జర్నలిస్టు, రచయిత మైకేల్ వూల్ఫ్ రాసిన ‘ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్’ పుస్తకంలో కల్పనలే ఉన్నాయని శారా సాండర్స్ పేర్కొన్నారు. ఈ పుసక్తం ట్రంప్ ప్రతిష్ఠను దిగజార్చేదిగా, హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.