కేన్సర్‌ చికిత్సకు మరో మార్గం! | Another way to treat the cancer! | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ చికిత్సకు మరో మార్గం!

Published Sat, Sep 16 2017 4:16 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

కేన్సర్‌ చికిత్సకు మరో మార్గం!

కేన్సర్‌ చికిత్సకు మరో మార్గం!

కేన్సర్‌ వ్యాధికి సమర్థమైన చికిత్సను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చిలగడదుంపలకు ఆశించే శిలీంధ్రాలు ఉత్పత్తి చేసిన ఓ రసాయన మూలకం కేన్సర్‌ కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోగలదని డ్యూక్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు వందేళ్ల క్రితం ఒట్టో వార్‌బర్గ్‌ అనే శాస్త్రవేత్త కేన్సర్‌ కణాల గురించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రతిపాదించారు. సాధారణ కణాలు ఆక్సిజన్‌ సాయంతో చక్కెరలను విడగొట్టి శక్తిని పొందుతుంటే...కేన్సర్‌ కణాలు చక్కెరలను పులియబెట్టడం ద్వారా ఆ పని చేస్తున్నాయని వార్‌బర్గ్‌ గుర్తించారు.

అయితే ఇలా ఎందుకు జరుగుతోందో మాత్రం చెప్పలేకపోయారు. తాజాగా డ్యూక్‌ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ గుట్టు కాస్తా వీడిపోయింది. జీఏడీపీహెచ్‌ అనే ఓ ఎంజైమ్‌ కేన్సర్‌ కణాల్లో చక్కెరలు విడిపోయే వేగాన్ని నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఎంజైమ్‌ పనితీరును అడ్డుకునే రసాయన మూలకాలేవైనా ఉన్నాయా? అని వెతికినప్పుడు కోనిన్‌జిక్‌ యాసిడ్‌ (కేఏ) గురించి తెలిసింది. చిలగడదుంపల్లోని చక్కెరలను బ్యాక్టీరియా తీసుకెళ్లిపోకుండా అడ్డుకునేందుకు ఒక రకమైన శిలీంధ్రం ఈ కేఏను ఉత్పత్తి చేస్తుంది. మరిన్ని పరిశోధనల ద్వారా కేన్సర్‌ కణాలపై కేఏ ప్రభావాన్ని నిర్ధారణ చేసుకోగలిగితే కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోవచ్చునని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement