మరో మూడు పెద్ద ఆపిల్‌ ప్లాంట్లు | Apple CEO Promised 3 New US Plants: Trump | Sakshi
Sakshi News home page

మరో మూడు పెద్ద ఆపిల్‌ ప్లాంట్లు

Published Wed, Jul 26 2017 9:59 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

మరో మూడు పెద్ద ఆపిల్‌ ప్లాంట్లు - Sakshi

మరో మూడు పెద్ద ఆపిల్‌ ప్లాంట్లు

న్యూయార్క్‌: అమెరికాలో మరో మూడు ఆపిల్‌ ప్లాంట్లను ఏర్పాటుకానున్నాయా? ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారా? అంటే అవుననే ఉంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు. అయితే, కుక్‌ ఈ విషయాన్ని బహిరంగంగా కాకుండా తనకు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది.

టిమ్‌ కుక్‌ అమెరికాలో మరో మూడు పెద్ద ఆపిల్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారని తనకు హామీ ఇచ్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్లు వాట్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు మాత్రం ఇంకా తెలియజేయలేదు. మరోపక్క, ఆపిల్‌ సంస్థ నుంచి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement