గుండె చప్పుళ్లను గుర్తించే కృత్రిమ మేధస్సు! | Artificial intelligence that detects heartbeats! | Sakshi
Sakshi News home page

గుండె చప్పుళ్లను గుర్తించే కృత్రిమ మేధస్సు!

Published Mon, Jul 10 2017 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 4:52 PM

గుండె చప్పుళ్లను గుర్తించే కృత్రిమ మేధస్సు! - Sakshi

గుండె చప్పుళ్లను గుర్తించే కృత్రిమ మేధస్సు!

గుండె చప్పుళ్లలో వచ్చే తేడాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తేవచ్చు. ఈ తేడాలను గుర్తిం చడం అంత సులువు కాదు. ఈసీజీ తదితర వివరాలున్నప్పటికీ వీటి వల్ల నిపుణులైన డాక్టర్లు సైతం ఒక్కోసారి పొరపాటు పడే అవకాశముంది. అయితే స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఈ సమస్య త్వరలోనే సమిసిపోనుంది. అరిథ్రిమియాస్‌ అని పిలిచే ఈ పరిస్థితిని స్పష్టంగా గుర్తించేందుకు వీరు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. రోగులు ఎంత దూరంలో ఉన్నా వారి గుండె సమస్యలను గుర్తించగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. అరిథ్రిమియాస్‌ ఉన్న వారికి తరచూ ఈసీ జీలు తీయాల్సి ఉంటుంది.

అయితే ఈసీ జీ వల్ల సమస్య ఏమిటన్నది తెలియకపోతే గుండెచప్పుళ్లను 2 వారాల పాటు నమోదు చేసి ఆ వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని అధిగమించేందుకు ఈసీజీ సంకేతాల ద్వారానే 14 రకాల అరిథ్రిమియాస్‌లను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సుతో పనిచేసే అల్గారిథమ్‌ను సిద్ధం చేశారు. ఐరిథమ్‌ అనే సంస్థ ద్వారా సేకరించిన ఈసీజీ సంకేతాల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశామని, సూక్ష్మమైన తేడాలను ఇది గుర్తిస్తుందని అంటున్నారు ఈ ప్రాజెక్టులో భాగం వహించిన ప్రణవ్‌ రాజ్‌పుర్కార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement