ఈజిప్టులో వింత వైద్యం.. వీడియో హల్ చల్! | Awful video shows man pulling out patients teeth with rusty pliers | Sakshi
Sakshi News home page

ఈజిప్టులో వింత వైద్యం.. వీడియో హల్ చల్!

Published Sat, Jul 9 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

ఈజిప్టులో వింత వైద్యం.. వీడియో హల్ చల్!

ఈజిప్టులో వింత వైద్యం.. వీడియో హల్ చల్!

కైరో: దంతాల సమస్య ఉందంటూ తన వద్దకు వచ్చిన పేషెంట్ కు ఓ డెంటిస్ట్ వింత వైద్యం చేశాడు. ఓ తుప్పుపట్టిన కటింగ్ ప్లయర్నే ఆపరేషన్ సాధనంగా మార్చుకున్నాడు. కటింగ్ ప్లయర్ నోటిలో పెట్టి బలంగా లాగి దంతాన్ని పీకేశాడు. అయితే ఈ సీన్ మొత్తం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది.

డాక్టర్కు క్లినిక్ అంటూ ఏదీ లేదు. రోడ్డుపక్కన వైద్యం చేస్తుంటాడు. ఓ వ్యక్తి తన సమస్యను ఆ డాక్టర్కు విన్నవించుకున్నాడు. కూర్చీలో పేషెంట్ ను కూర్చోబెట్టి తుప్పుపట్టిన కటింగ్ ప్లయర్తో ఆపరేషన్ చేశాడు. అదేనండీ.. నాలుగైదుసార్లు ప్రయత్నించి చివరికి దంతాన్ని పీకేశాడు. కానీ ఆ పేషెంట్ నొప్పితో విలవిలలాడిపోయాడు.

ఎందుకంటే దంతంతో పాటు చిగురు కొంత భాగం కూడా ఊడివచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. పేషెంట్ నొప్పితో బాధపడుతుంటే.. మరోవైపు ఆ వైద్యుడు మాత్రం ఏదో సాధించాను అన్న తరహాలో నవ్వుతుండటం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement