
నది ఒడ్డున లభించిన చేతులు
మాస్కో : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54 చేతులు నది ఒడ్డున లభించడంతో ప్రపంచమంతా కలవరానికి గురిచేస్తోంది. ఇది తీవ్రవాదులు చేశారా? వైద్య సంస్థలు చేశాయా? ఏమైనా పూజలా లేక శిక్షలా? అని తేల్చే పనిలో రష్యన్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్ వారికీ అంతు చిక్కకుండా చేతుల వేలిముద్రలను చెరిపేశారు.
రష్యాలోని అముర్ నది ఒడ్డున ఒక సంచిలో మణికట్టు వరకు నరికేసిన మనుషుల అరచేతులు 54 కనిపించడం.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు ఆ చేతులను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ మిస్టరీనీ ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ చేతుల దగ్గర్లో మెడికల్ సామాగ్రి లభించడం, వేలిముద్రలు లభించకుండా చేతులను తరగటం ఇవన్ని పోలీసులకు అనుమానాలు కలిగిస్తున్నాయి. అసలు ఈ చేతులు ఎవరివి, మృతదేహాల నుంచి సేకరించారా లేక ఎవరినైనా శిక్షించేందుకు ఇలా నరికేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment