
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి(సీజే) ఎస్కే సిన్హాపై అవినీతి, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ పదవి చేపట్టిన తొలి హిందువు ఆయనే. సుప్రీంకోర్టు జడ్జీలను అభిశంసించే పార్లమెంట్ అధికారాలను రద్దుచేస్తూ ఆయన జూలైలో తీర్పునిచ్చారు. దీంతో ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో అవమానంతో శుక్రవారం ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్లు తెలిసింది.
సిన్హా అవినీతికి సంబంధించిన సమాచారాన్ని స్వయానా బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు జడ్జీలకు అందించారు. అవినీతి, మనీల్యాండరింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చే దాకా ఆయనతో కలసి పనిచేయమని జడ్జీలు చెప్పారు. దీంతో రాజీనామా చేస్తానన్న సిన్హా...నెల రోజుల సెలవు కావాలని అక్టోబర్ 2న అధ్యక్షుడిని కోరారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment