
నోబెల్ స్వీకరణకు రాలేను: బాబ్ డిలన్
స్టాక్‌హోం: నోబెల్ సాహిత్య బహుమతి-2016కి ఎంపికైన అమెరికాకు చెందిన పాటల రచరుుత, గాయకుడు బాబ్ డిలన్ పురస్కారాల ప్రదానోత్సవానికి రావడం లేదని స్వీడీష్ అకాడమీ తెలిపింది. ‘అవార్డును వ్యక్తిగతంగా వచ్చి తీసుకోవాలని అనుకున్నాను. కానీ కొన్ని ఇతర పనులు ఉన్నందున వల్ల హాజరు కాలేకపోతున్నాను’ అని డిలన్ నుంచి లేఖ అందినట్లు పేర్కొంది.
ఆల్ఫెడ్ర్ నోబెల్ వర్ధంతి అరుున డిసెంబరు 10న ప్రతి ఏడాది స్టాక్‌హోంలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. డిలన్ రాకపోరుునా ఇబ్బందేమీ లేదనీ, డిసెంబరు 10 నుంచి ఆరు నెలలలోపు ఆయన తన ఉపన్యాసాన్ని అందిస్తే చాలని స్వీడన్ అకాడమీ తెలిపింది.