అంగారకుడిపై ‘బోరాన్‌’ ఆనవాళ్లు | 'Boron' landmarks on Mars | Sakshi
Sakshi News home page

అంగారకుడిపై ‘బోరాన్‌’ ఆనవాళ్లు

Published Thu, Dec 15 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

అంగారకుడిపై ‘బోరాన్‌’ ఆనవాళ్లు

అంగారకుడిపై ‘బోరాన్‌’ ఆనవాళ్లు

నివాసయోగ్యమైన వాతావరణం ఉండేదని భావిస్తున్న శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: అంగారకుడిపైకి మానవుడు నివసించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కన్పిస్తున్నాయి. ఆ గ్రహంపై బోరాన్‌ మూలకం ఆనవాళ్లు ఉన్నట్లు ‘నాసా’ పంపిన క్యూరియాసిటీ రోవర్‌ తొలిసారిగా గుర్తించింది. దీన్ని బట్టి పూర్వం అంగారకుడి పొరల్లో నీరు ఉండేదని, ఈ వాతావరణం సూక్ష్మజీవులకు నివాస యోగ్యమైనది కావచ్చని భావిస్తున్నారు.

అక్కడి కాల్షియం సల్ఫేట్‌ ఖనిజ చారల్లో కనుగొన్నబోరాన్‌.. భూమిపై ఉన్న బోరాన్‌తో సరితూగితే అంగారకుడి లోపల ఉన్న నీటి ప్రవాహం వల్లే ఈ చారలు ఏర్పడి ఉంటాయని అమెరికాలోని లాస్‌ అలమోస్‌ నేషనల్‌ లేబొరేటరీ శాస్త్రవేత్త పాట్రిక్‌ గాస్దా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement