నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు | Britain visas issue will be after the verification of criminal background | Sakshi
Sakshi News home page

నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు

Published Sat, Mar 18 2017 4:46 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు - Sakshi

నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు

లండన్‌: బ్రిటన్‌లో పనిచేయాలనుకునే ఉపాధ్యాయులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు టైర్‌–2 వీసాకు దరఖాస్తు సమయంలో వారిపై ఎలాంటి నేరచరిత్ర లేదని చూపే పత్రాల్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. నాన్‌ ఈయూ దేశాలకు వర్తించే ఈ నిబంధనను ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తేవాలని బ్రిటన్‌ భావిస్తుంది. అందుకనువుగా త్వరలో పార్లమెంట్‌ ఆమోదానికి పంపనుంది.

అలాగే చిన్నారులు, అనారోగ్యంతో ఉన్న పెద్దలకు సేవ చేయాలని వచ్చేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. గత పదేళ్లుగా నివసిస్తున్న దేశంలో వారిపై ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని వీసా దరఖాస్తు సమయంలో సమర్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement