బీజింగ్ : పొరుగు దేశం చైనాలో మొదలైన కరోనా కలకలం త్వరత్వరగా ప్రపంచాన్ని చుట్టేసేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 800 మంది ఈ వ్యాధి బారిన పడగా.. వారిలో 25 మంది ప్రాణాలు విడిచారు. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేశాయి. విదేశాల నుంచి వచ్చేవారికి.. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేవారికి సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
(చదవండి : కరోనా వైరస్ గుప్పిట్లో చైనా..!) ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు, క్రౌడ్ ఫండింగ్
ఇక బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ 20 మంది వైద్య సిబ్బంది కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా రోగులకు చికిత్స అందించాలంటేనే వారు జంకుతున్నారు. ‘అత్యంత ప్రమాదకరమైన వస్తువు’గా.. కరోనా పేషంట్లను చూస్తున్నారు. కరోనా వైరస్ సోకిన ఓ పేషంట్లను ప్లాస్టిక్ ట్యూబుల్లో పెట్టి తరలిస్తున్నారు. హజ్మట్ సూట్లు ధరించి కరోనా పేషంట్‌ను తరలిస్తున్న ఈ దృశ్యం చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో వెలుగు చూసింది. ఇక కరోనాను మొదటగా గుర్తించిన వుహాన్ నగరం, హువాంగ్‌గాంగ్ నగరాల్ని మూసేశారు. చైనాలోని విష సర్పాల్లో మొదలైనా ఈ వైరస్.. మనుషులకు పాకినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
(చదవండి : గ్రేటర్‌లో ‘కరోనా’ అలర్ట్!)
Comments
Please login to add a commentAdd a comment