చైనా, పాక్ వాయుసేనల సంయుక్త విన్యాసాలు
చైనా, పాక్ వాయుసేనల సంయుక్త విన్యాసాలు
Published Fri, Sep 8 2017 8:30 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
బీజింగ్: చైనా, పాకిస్తాన్ వాయుసేనలు తమ సంయుక్త విన్యాసాలను శుక్రవారం ప్రారంభించాయి. ఈ విన్యాసాల్లో ఇరు సేనలకు చెందిన తాజా యుద్ధ విమానాలు, ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాలుపంచుకుంటున్నాయి. చైనాకు చెందిన జే-11 ఫైటర్స్, జేహెచ్-7 ఫైటర్ బాంబర్లు, కేజే-200 ఏడబ్ల్యూఏసీఎస్ ఎయిర్‌క్రాఫ్ట్, క్షిపణులు రాడార్ దళాలు పాల్గొంటున్నాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి షెన్ జింకె చెప్పారు. ఈ విన్యాసాల్లో పాక్‌కు చెందిన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్స్, షహీన్ 6 ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొంటాయని షెన్ తెలిపారు.
చైనాలో ఈ కసరత్తు సెప్టెంబర్ 27వరకూ జరగనుంది. ప్రపంచ శ్రేణి ఎయిర్‌ఫోర్స్‌ను నిర్మించేందుకు విదేశీ సేనల నుంచి తాము నేర్చుకోవాల్సింది ఉందని, బహుళ టాస్క్‌లను ఎదుర్కొనేందుకు సామర్ధ్యం మెరుగుపరుచుకోవాలని షెన్ చెప్పారు.
Advertisement
Advertisement