షాంఘై : సాంకేతిక రంగంతో పాటు మిగిలిన అన్ని రంగాల్లో సత్తాచాటుతున్న చైనా.. తాజాగా పర్యావరణంపై దృష్టి సారించింది. దేశంలోని అటవీ విస్తీర్ణాన్ని 23 శాతానికి పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఒక్కొక్క అడవి దాదాపు ఐర్లాండ్ దేశ విస్తీర్ణానికి సమానంగా ఉంటుంది.
లక్ష మొక్కలను నాటి బతికించడానికి ప్రపంచదేశాల ప్రభుత్వాలు కష్టపడుతుంటే.. మరి చైనా అంత భారీ విస్తీర్ణంలో మొక్కలను నాటి అడవిగా మార్చగలుగుతుందా?. చైనాకు ఇది సాధ్యమే. ఇప్పటికే ఇదే పద్దతిలో 33.8 హెక్టార్లలో మొక్కలను దిగ్విజయంగా పెంచింది డ్రాగన్ దేశం. రానున్న పదేళ్లలో దేశ అటవీ శాతాన్ని 21 నుంచి 23 శాతానికి పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని చైనా డైలీ ఓ కథనంలో పేర్కొంది.
2018లో 6.66 మిలియన్ హెక్టార్ల అడవులను పెంచాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని కూడా ఆ పత్రిక వివరించింది. కాగా, ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరంగా బీజింగ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. దీంతో పారిశ్రామిక విప్లవంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని చైనా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment