
ట్రంప్‌కు జిన్‌పింగ్ వార్నింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సోమవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. కొన్ని నెగిటివ్ థింగ్స్ వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని జిన్‌పింగ్ ట్రంప్‌కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా ఒప్పుకోవడంతోనే జిన్‌పింగ్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చైనా ప్రభుత్వ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
మనుషుల అక్రమ రవాణా విషయంలో కూడా బీజింగ్‌కు తక్కువ గ్రేడ్ ఇవ్వడంపై కూడా చైనా గుర్రుగా ఉంది. ఇకనైనా అమెరికా తన రూటు మార్చుకుని వన్ చైనా పాలసీని అనుసరిస్తుందని భావిస్తున్నట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.