బీజింగ్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) చైనా, అమెరికా నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వేలాది మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి పుట్టుక గురించి ఇరు దేశాల నేతలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడినపుడు ఆ దేశం సరైన జాగ్రత్తలు తీసుకోనందు వల్లే సమస్య ఇంత జటిలంగా మారిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ మండిపడగా... కరోనాను ‘వుహాన్ వైరస్’గా ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభివర్ణించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ అమెరికా నేతల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యాధికారులే ఈ ప్రాణాంతక వైరస్‌ను చైనాలోకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ బోర్డు డైరెక్టర్(సీడీసీ), వైరాలజిస్ట్ రాబర్ట్ ఆర్.రెడ్‌ఫీల్డ్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో చేసిన ప్రసంగ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. (ప్రపంచంపై కరోనా పడగ)
‘‘ఇన్‌ఫ్లూయెంజా(ఫ్లూ) కారణంగా సంభవించిన కొన్ని మరణాలకు కోవిడ్-19 కారణమని అమెరికా సీడీసీ డైరెక్టర్ చెప్పారు. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా 34 మిలియన్ల మంది బాధపడుతున్నారని.. అదే విధంగా 20 వేల మంది మరణించారని పేర్కొన్నారు. అందులో కోవిడ్19 వల్ల సంభవించిన మరణాలు ఎన్ని? దయచేసి మాకు ఆ విషయం చెప్పండి. ఇంకో విషయం సీడీసీ చూడండి అక్కడే ఎలా దగ్గుతున్నారో.. అసలు అమెరికాలో ఎంతమంది వైరస్ బారిన పడిన పేషెంట్లు ఉన్నారు? వారికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల పేర్లేంటి? బహుశా అమెరికా సైన్యమే ఈ ప్రాణాంతక వైరస్‌ను వుహాన్‌కు తీసుకువచ్చి ఉంటారు. పారదర్శకంగా వ్యవహరించండి! గణాంకాలను ప్రజలకు తెలియజేయండి! అమెరికా వివరణ ఇవ్వాల్సిందే’’ అని లిజియాన్ డిమాండ్ చేశారు.
కాగా ఆయన వ్యాఖ్యలను రాబర్ట్ ఒబ్రెయిన్ మరోసారి తిప్పికొట్టారు. కరోనా అమెరికాలో పుట్టలేదని.. కచ్చితంగా వుహాన్‌లోనే ఉద్భవించిందని చెప్పుకొచ్చారు. కాగా మొదటి కరోనా కేసును వుహాన్‌లో కనుగొన్నామని చైనా సీడీసీ గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దాదాపు 115 దేశాల్లో రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా, గురువారం నాటికి 4వేలకు పైగా మంది మృత్యువాత పడ్డారు.(అలా కరోనా వైరస్‌ను జయించాను!)
చదవండి: ‘కరోనా’పై ట్రంప్ కీలక నిర్ణయం
కోవిడ్ దెబ్బ: భయపడవద్దన్న ట్రంప్!
Some #influenza deaths were actually infected with #COVID-19, Robert Redfield from US #CDC admitted at the House of Representatives. US reported 34 million cases of influenza and 20,000 deaths. Please tell us how many are related to COVID-19? @CDCDirector pic.twitter.com/vYNZRFPWo3
— Lijian Zhao 赵立坚 (@zlj517) March 12, 2020
Comments
Please login to add a commentAdd a comment