డాన్స్ చేయడానికి భర్త రాలేదని ఆత్మహత్యాయత్నం | Chinese woman in suicide bid as husband rejects dancing | Sakshi
Sakshi News home page

డాన్స్ చేయడానికి భర్త రాలేదని ఆత్మహత్యాయత్నం

Published Tue, Jul 8 2014 4:45 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

డాన్స్ చేయడానికి భర్త రాలేదని ఆత్మహత్యాయత్నం - Sakshi

డాన్స్ చేయడానికి భర్త రాలేదని ఆత్మహత్యాయత్నం

బీజింగ్: తనతో కలసి గ్రూప్ డాన్స్ చేయడానికి భర్త నిరాకరించడాని భార్య ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. 53 ఏళ్ల మహిళ మద్యంలో క్రిమిసంహారక మందు కలుపుకొని తాగింది. భర్త వెంటనే గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో  చికిత్స పొందుతోంది. చైనాలో ఈ సంఘటన జరిగింది.

చైనాలో మధ్య, ఆపై వయసు వారు గ్రూపులుగా ఏర్పడి డాన్స్ చేయడం బాగా ప్రాచుర్యం పొందింది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు కూడా గ్రూప్ డాన్స్ అంటే హాబీ. భర్త నిరాకరించడాన్ని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. తనకిక బతకాలని లేదంటూ విలపిస్తూ కూతురితో చెప్పింది. భర్త, కూతురు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement