న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి సంబంధించి చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో పాటు ప్రపంచానికి చైనా తీరని నష్టం చేకూర్చిందని విమర్శించారు. కరోనా విషయంలో చైనా గోప్యత పాటించడం వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు. దీనికి చైనానే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరోవైపు ఇటీవల కాలంలో ఇతర దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
హాంకాంగ్ విషయంలో చైనా తీరుని అమెరికాతోపాటు యూకే, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి.గతంలో కూడా కరోనా విషయంలో చైనా అనుసరించిన వైఖరిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment