
కిమ్, ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, తాను ప్రేమలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ ‘అణు’ అధ్యక్షుడి నుంచి తాను తరచూ ప్రేమలేఖలు అందుకుంటున్నానని రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా శనివారం వెస్ట్ వర్జీనియాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన అన్నారు. ‘మేం ప్రేమలో పడ్డాం.. ఆయన నాకు అందమైన ప్రేమలేఖలు రాస్తున్నారు’ అని ట్రంప్ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి అన్నారు.
గత సోమవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ కొరియా అధ్యక్షుడిని ఉద్దేశించి మాట్లాడారు. గత బుధవారం తాను కిమ్ నుంచి అసాధారణ లేఖ అందుకున్నానని, మా ఇద్దరి మధ్య తదుపరి సమావేశానికి సానుకూలతపరంగా ఇది గొప్ప పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే శనివారం ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో మాట్లాడుతూ ‘మా దేశంమీద యూఎన్ ఆంక్షలు కొనసాగినంత కాలం మా దృక్పథంలో మార్పు ఆశించకూడదు’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment