బీఎండబ్ల్యూ కారులో మంటలు..
మాస్కో: బీఎండబ్ల్యూ కారుకు ఉన్నట్లుండి మంటలంటుకున్న ఘటన రష్యాలో చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెర్మ్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ అజ్ఞాత వ్యక్తి తన మొబైల్‌లో షూట్ చేశాడు. బీఎండబ్ల్యూ ఎం5 మోడల్ కారులో మంటలను గమనించగానే డ్రైవర్ దానిని వేగంగా ముందుకు నడిపాడు. అనతంతరం అతడివైపు నుంచి మంటలు తగ్గడంతో డోర్ ఓపెన్ చేసి బయటపడ్డాడు. కారులో మంటలు ఎలా వ్యాపించాయి అనే విషయం తెలియరాలేదు. అయితే.. ఈ దృశ్యాలను చూసినవారు మాత్రం ’నిజమైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇది’ అని కామెంట్ చేస్తున్నారు.