జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ ప్రాంతంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రాకారం రాత్రి 9.26 గంటలకు కమమొటో పరిధిలోని మషికి పట్టణంలో సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు జపాన్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. అయితే ఈ భూకంపంతో సునామీ ప్రమాదమేమీ లేదని వెల్లడించింది. భూకంపం దాటికి 30 సెకన్ల పాటు ప్రకంపనలు గుర్తించామని, ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయని స్థానికులు వెల్లడించారు.
భూకంపంపై జపాన్ ప్రధానమంత్రి షింజో అబే స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు చేపడుతామని తెలిపారు. భూకంప కేంద్రం భూమిలోపల 23 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది.