
కుప్పకూలిన విమానం: 22 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది.
క్వీటో: దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. దేశ తూర్పుప్రాంతంలోని పస్తాజా ప్రావిన్స్ లో మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామన) ఒక సైనిక విమానం కుప్పకూలిపోయినట్లు ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది సైనికులు దుర్మరణం చెందినట్లు తెలిసింది.
'విమానంలో ఉన్న 22 మంది సైనికుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో జీవించిలేరు' అని దేశాధ్యక్షుడు రాఫెల్ కొరియో ట్విట్టర్ లో తెలిపారు. ఈక్వెడార్ చరిత్రలోనే ఇది అత్యంత ఘెర విమాన ప్రమాదం కావటం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.