![గజరాజు దెబ్బ.. మొసలికి మైండ్ బ్లాంక్!](/styles/webp/s3/article_images/2017/09/3/71451275601_625x300.jpg.webp?itok=oZthrqa7)
గజరాజు దెబ్బ.. మొసలికి మైండ్ బ్లాంక్!
దక్షిణాఫ్రికా: ఫొటో చూడగానే నాటి గజేంద్రమోక్షం సీన్ గుర్తుకురావడం లేదూ.. అయితే.. ఇక్కడ మొసలి కాస్త కన్ఫ్యూజ్ అయి ఈ గజేంద్రుడి కాలికి బదులు తొండాన్ని పట్టుకున్నట్లుంది. అప్పట్లో అంటే ప్రార్థించగానే విష్ణుమూర్తి విచ్చేశారు.
ఇది కలియుగం కదా.. అందుకే విష్ణుమూర్తి కోసం వెయిట్ చేయకుండా గజేంద్రుడే తన బలమంతా ఉపయోగించి.. తొండాన్ని లేపి ఇలా విసిరికొట్టడంతో మొసలి అల్లంత దూరాన ఎగిరి పడింది. ఈ సీన్ దక్షిణాఫ్రికాలోని సబీ శాండ్స్ గేమ్ రిజర్వు పార్కులో చోటుచేసుకుంది.