![ఏనుగమ్మా.. బొమ్మేసిందమ్మా... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51403046645_625x300.jpg.webp?itok=pZzKBtYo)
ఏనుగమ్మా.. బొమ్మేసిందమ్మా...
ఎర్ర గులాబీ పూల మొక్క.. చక్కని పెయింటింగ్.. అయితే దీన్ని వేసింది ఓ ఏనుగంటే మీరు నమ్మగలరా? ఏదో పిచ్చిపిచ్చి గీతలు తప్ప అవేమి వేయగలవు అని భావించేవారు.. థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్‌లో ఉన్న ఎలిఫెంట్ క్యాంప్‌లో ఉన్న గజరాజులను చూసి డంగైపోవాల్సిందే.. ఒక్కోటి.. ఒక్కో ఎంఎఫ్ హుస్సేన్ తరహాలో బ్రష్ పట్టుకుని.. చిత్రాలు ఎడాపెడా గీసేస్తాయి. ఇక్కడ మొత్తం ఏడు ఏనుగులు చిత్రకళలో ఆరితేరాయి. ఈ చిత్రాలను అమ్మితే.. ఒక్కోటి రూ.1.3 లక్షల దాకా పలికాయి.