Red Rose
-
రెడ్ రోజ్‌లా గుబాళిస్తున్న నభా నటేశ్ (ఫొటోలు)
-
కమ్యూనిస్టులు.. ఎర్ర గులాబీలు
సాక్షిప్రతినిధి, వరంగల్: కమ్యూనిస్టు పార్టీ నేతలు ‘ఎర్ర గులాబీలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీ నేతలు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేయడానికి అవగాహన కుదుర్చుకు న్నాయని ఆరోపించారు. ఈ నెల 21న మునుగోడులో జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేయా లని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్ద ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్.ఇంద్రసేనా రెడ్డి, జితేందర్‌రెడ్డి, జి.వివేక్, కొండా విశ్వే శ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ‘మునుగోడు’ సెమీఫైనల్ మునుగోడు ఉప ఎన్నిక 2023లో తెలంగాణ లో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటిదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగసభను విజయవంతం చేయడానికి నడుం బిగించాలని సంజయ్ పిలుపునిచ్చారు. వెయ్యి కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరణ లింగాలఘణపురం మండలం అప్పిరెడ్డిపల్లి సమీపంలో సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మొక్కను నాటారు. చవదండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
ఎర్రగులాబి
‘‘గుడ్ మార్నింగ్... నమస్తే.. ఆదాబ్.. నేను సూపర్ కూల్.. మీరు వింటున్నారు రేడియో నీమ్.. ఇది చాలా చేదు బాస్. యే డైట్ అయినా షుగర్‌కి నో అంటోంది కాని బిట్టర్కి కాదు. బిట్టర్ ఎంత బెస్టో తెలుసా! చేదుకు అలవాటు పడితే.. ఎంతటి కషాయాన్నయినా.. ఐ మీన్ ఎంతటి కష్టాన్నయినా ఇట్టే మింగేయొచ్చు’’ సాగుతోంది నాన్‌స్టాప్‌గా!మొబైల్ ఫోన్లో మెసేజెస్ బ్లింక్ అవుతూన్నాయి. ఆసక్తి..అనాసక్తి..వంటివేవీ ప్రదర్శించకుండా తన పనిలో నిమగ్నమైంది ఆ గొంతు. షో తర్వాత ఫోన్ చూసుకుంటే... ‘‘హేయ్..! వెన్ విల్ వి మీట్’’ మెసేజే రిపీటెడ్‌గా ఉంది. డయల్ చేయబోతుండగానే.. రింగ్ అయింది.. ‘‘భైరవా..’’‘‘హాయ్.. ’’ ఆత్రం, ప్రేమ, మార్దవంగా భైరవ. ‘‘సారీ.. ఇందాక షోలో ఉండి రిప్లయ్ ఇవ్వలేదు’’‘‘ఓహ్.. సారీ డిస్టర్బ్ చేసినందుకు.. ’’నొచ్చుకుంటూ భైరవ. ‘‘కమాన్ మ్యాన్.. డోంట్ బీ ఫార్మల్’’‘‘అయితే.. చెప్పు.. ఎప్పుడు కలుస్తున్నావ్?’’‘‘అప్పుడే ఎందుకంత తొందర? కలుద్దాం’’ నింపాదిగా!‘‘ హే.. ఇట్స్ బీన్ ఎ మంత్.. డార్లింగ్?’’ భైరవ‘‘అందుకే అంత తొందరా అంటున్నా..’’‘‘హలో బేబీ.. ఇది మిలేనియల్స్ ఏజ్. నిన్న కలిసి.. ఈ రోజు ప్రేమించుకుని.. రేపు బ్రేకప్ చేసుకునేంత స్పీడ్..’’‘‘ఆహా... ’’‘‘యెస్ బేబీ!చచ్చిపోతున్నా.. నరకం కనపడుతోంది.. వినిపించడం తప్ప కనిపించవు’’. ‘‘కమా...న్ డియర్’’ మత్తుగా!అంతే ఆ స్వరంలోని హస్కీనెస్కు నోటమాట రాలేదు భైరవకు. ‘‘బై.. విల్ మీట్ సూన్..’’ ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ∙∙ ‘‘పిన్నీ..ప్లీజ్.. ఏడిస్తే పోయిన ఆత్మిక మళ్లీ రాదు కదా! చూడూ.. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావో?’’ ‘‘ నా వల్ల కావట్లేదు. ఆరోజు దాన్ని ఒంటరిగా వదిలి ఉండాల్సింది కాదు. పాపిష్టిదాన్ని!‘మమ్మీ తలనొప్పిగా ఉంది.. కాసేపు పడుకుంటా’ అంటే.. పడుకోనీ అని నా చేతులతోనే తలుపేసి హాల్లోకి వచ్చా. దాంతోపాటే ఉన్నా అదిలా చేసుండేది కాదు. అది ఉరేసుకొని నా ఊపిరి తీసింది. నేను, మీ బాబాయ్ ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి?’’ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది చిత్ర. ఆ దుర్ఘటనను అలా ఆమె గుర్తు చేసుకోవడం లక్షా ఎనభయ్యోసారి.‘‘ఊరుకో పిన్నీ.. ప్లీజ్’’ అంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఆత్మిక చనిపోయి ఏడు నెలలు అవుతోంది. ఆకలి, నిద్ర ఆమె దరిదాపుల్లోకి రాక ఏడునెల్లవుతోంది. కాలం చిత్ర గాయాన్ని ఏమాత్రం మాన్పలేకపోతోంది. ఆత్మిక ఆత్మహత్య కంటే కూడా చిత్ర క్షోభే ఆ ఇంట్లో వాళ్లను కలత పెడ్తోంది. కౌన్సెలింగ్,సైకియాట్రి, ఆధ్యాత్మికత.. ఏమీ చేయలేకపోతున్నాయి. ‘‘ఆత్మిక ఆత్మ వచ్చి చెబితే గానీ మీ పిన్నీ మనుషుల్లోపడదు’’ జనాంతికంగా అన్నాడు సురేష్.. భార్య మానసిక స్థితి చూడలేక. ‘‘నేనొస్తేనన్నా.. కాస్త తేరుకొని మనుషుల్లో పడ్తుందని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా బాబాయ్! ప్చ్..నేనూ ఏం చేయలేక పోతున్నా..’’ బాధగా.‘‘ఛ..ఛ! అలా అనకురా.. నువ్వు రావడం నిజంగా మంచిదే అయింది. నేను కాస్తయినా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా’’ భుజమ్మీద చేయివేస్తూ అనునయంగా అన్నాడు సురేష్. ఆత్మీక, తను కజిన్సే కాని సిబ్లింగ్స్ కన్నా క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఒకరంటే ఒకరికే కాదు.. ఆ ఇద్దరన్నదమ్ముల కుటుంబాలకూ ప్రాణం. ‘‘ఆత్మికా.. మై సిస్టర్.. నిన్ను మాకు కాకుండా చేసినవాడిని.. పిన్నిని ఇలా పిచ్చిదానిలా మార్చిన వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు..’’ అంటుంటే.. గోడ మీద ఉన్న ఆత్మిక ఫోటోకి వేలాడ దీసిన దండలోంచి ఎర్ర గులాబీ కింద పడింది. ∙∙ ‘‘హలో... మళ్లీ డిస్టర్బ్ చేస్తున్నానా?’’ భైరవ‘‘ఏం లేదు.. చెప్పు’’‘‘నిన్ను కలవకుండానే పోతానేమో’’ భైరవ‘‘అబ్బా..అంత నిరాశా?’’ ‘మరేంచేయను? నీ వాయిస్.. పెక్యూలియర్ వాయిస్ వినే భాగ్యం దొరికింది ఈ జన్మకిది చాలు అనుకుంటా’’ ‘‘ఆహా..’’‘‘నిజం.. ఐ మీన్ ఇట్. గమ్మత్తయిన వాయిస్. నిన్ను చూడకుండా నీతో లవ్‌లో పడ్డానంటే నీ వాయిసే కారణం. యు షుడ్ థ్యాంక్ ఫుల్ టు గాడ్.. అలాంటి గొంతునిచ్చినందుకు’’ భైరవ‘‘సరేగాని..ఎందుకు కాల్ చేశావో చెప్పు’’‘‘ ఈ ఈవెనింగ్ కలవ్వా... ప్లీజ్’’ బతిమాలాడు భైరవ. ‘‘హూ.. ’’నిట్టూరుస్తూ.. ‘‘ఈ ఈవెనింగ్ కుదరకపోవచ్చు. సిక్స్ థర్టీకి రికార్డింగ్ ఉంది. ఆఫ్టర్ టెన్ అయితే ఓకే.. ’’‘‘ నైట్? నీకు ఓకే అయితే నాకూ ఓకే’’ కొంటెగా భైరవ. ‘‘వెన్యూ...?’’‘‘అదీ నువ్వే చెప్పు..’’ అన్నాడు అదే కొంటెతనంతో భైరవ‘‘వాట్సప్ చేస్తా...’’ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ∙∙ రాత్రి.. ‘‘హేయ్.. నీ వాయిస్‌కి తగ్గట్టే నీ టేస్ట్ కూడా పెక్యూలియర్’’ ‘‘ఆహా..’’‘‘కాకపోతే.. ఫస్ట్ టైమ్ నిన్ను చూడబోతుంటే వెన్యూ పెట్టేది ఈ ఊరి శ్మశానంలోనా?’’ వెటకారం భైరవలో.‘‘యే.. భయమేస్తోందా?’’ ‘‘అంతలేదు బేబీ.. త్వరగా రా.. వెయిటింగ్’’ అన్నాడు. ‘‘ వస్తున్నా’’సరిగ్గా పది గంటల పది నిమిషాలకు.. ఫోన్లో సూచించిన ప్రకారం.. ఓ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు సమాధి వెపు మొహం చేసి!సరిగ్గా అతని వెనకాల.. సన్నగా.. భుజాల వరకు జుట్టు.. జీన్స్.. షూ.. క్యాప్ స్వెట్టర్‌తో ఓ ఆకారం. క్యాప్‌తో తలంతా కవర్ చేసుకుని చేతులను జీన్స్ పాకెట్స్‌లో పెట్టుకుని మెడ వంచి ముందున్న ఓ రాయిని బలంగా తన్నింది ఆకారం. రాయి వెళ్లి సరాసరి భైరవ పిరుదుకు తగిలింది. అసంకల్పితంగా దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ వెనక్కి తిరిగాడు చటుక్కున.‘‘హాయ్..’’ అంటూ జేబుల్లోంచి చేతులు తీసి తల మీదున్న క్యాప్‌ను వెనక్కి తోస్తూ మొహాన్ని పైకెత్తింది ఆ ఆకారం. షాక్.. భైరవకు. గొంతు సుపరిచితం.. ఫేస్ ఏంటీ.. మీసాలతో?‘‘నువ్వు.. నువ్వు... అబ్బాయివా?’’ విస్మయం.‘‘యెస్.. ఆత్మిక అన్నను. నువ్వు నిలబడ్డది ఆత్మిక సమాధి దగ్గరే’’ చెప్పాడు.‘‘ఎంత మోసం’’ భైరవ. ‘‘నువ్వు నా చెల్లికి చేసిన దాని కంటేనా? ఏరా..ఒకరోజు పరిచయం.. రెండో రోజు ప్రేమ.. మూడో రోజు బ్రేకప్ ఆ... నా చెల్లిని చీట్ చేసింది ఇలాగే కదా?’’ అంటుంటే.. ‘‘అన్నయ్యా.. నువ్వాగు’’ అని వినిపించింది సమాధి వైపు నుంచి. ఇంకో షాక్ భైరవకి. అది ఆత్మిక గొంతు. వినిపించిన వైపు తిరిగాడు భయంగానే. నవ్వుతోంది ఆత్మిక.. నల్లటి చుడీ దార్లో తెల్లగా మెరిసిపోతూ.. పెద్ద జడను మెడకు చుట్టుకుని.. దోసిళ్ల కొద్దీ ఎర్ర గులాబీలను భైరవ మీదకు విసురుతూ. చూస్తుండగానే ఆ గులాబీలన్నీ భైరవను ముంచెత్తాయి శ్వాస తీసుకోనివ్వకుండా.‘‘ఇవన్నీ నువ్వు నాకిచ్చినవే.. తీసుకో.. తీసుకో’’ విరగబడి నవ్వుతూ భైరవ మీదకు వేస్తూనే ఉంది ఆత్మిక.వెనక్కి తిరిగాడు ఆత్మిక అన్న..క్యాప్ తల మీదకు జరుపుకొని చేతులు జేబుల్లోకి దూర్చుకుంటూ! సరస్వతి రమ -
జంట మధ్య చిచ్చు రేపిన ఎర్ర గులాబి!!
లక్నో : చట్టాన్ని మీరిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటుగా.. నిబంధనలు పాటించే పౌరులను గౌరవించడం కూడా తెలుసని నిరూపించేందుకు లక్నో ట్రాఫిక్ పోలీసులు రోజా పూలతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ గులాబి పువ్వు ఇచ్చారు. కానీ ఆ మంచి పని కూడా ఓ జంట కాపురంలో విభేదాలను సృష్టిస్తుందని వారు ఊహించలేదు. కాకపోతే ఫొటో సాయంతో ఆ విభేదాలు కాస్త ముగిసిపోవడంతో కథ సుఖాంతమైంది. అసలేం జరిగిందంటే... లక్నోకు చెందిన ఓ యువకుడు హెల్మెట్ ధరించి వెళ్తుండటంతో సికిందర్‌బాగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అతడికి ఎర్ర గులాబి ఇచ్చి అభినందించారు పోలీసులు. ఇంటికి వెళ్లిన తర్వాత అతడి బైక్‌ను తుడుస్తున్న క్రమంలో పువ్వును చూసిన ఆ వ్యక్తి భార్య కంగుతింది. గులాబీ పువ్వు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఆ పువ్వు ఎవరు ఇచ్చారని నిలదీయడంతో పాటుగా.. తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భావించి బోరున విలపించింది. ట్రాఫిక్ పోలీసులే పువ్వు ఇచ్చారని చెప్పినా నమ్మలేదు సరికదా ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తానని బెదిరించింది. తాను ఏ తప్పు చేయలేదని ఎంతగా మొత్తుకున్నా భార్య వినకపోవడంతో.. ఆ యువకుడు వెంటనే పోలీసుల దగ్గరకు పరుగెత్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. రోజా పూల కార్యక్రమం నాటి ఫొటో ఇవ్వాల్సిందిగా కోరాడు. చాలా సేపు వెదికిన తర్వాత ట్రాఫిక్ ఎస్సై ఫోన్లో అతడి ఫొటో దొరకడంతో ఊపిరి పీల్చుకున్నాడు. తన ఫొటోతో పాటుగా ఆ రోజు ఎర్ర గులాబీలు అందుకున్న మరికొంత మంది ఫొటోలు కూడా తీసుకెళ్లి భార్యకు చూపించడంతో కథ సుఖాంతమైంది. రోజాకు బదులు.. క్యాలీఫ్లవర్ ఈ సరదా సంఘటనను ట్రాఫిక్ ఎస్సై ప్రేమ్ శంకర్ షాహి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇప్పటి నుంచి రోజా పూలకు బదులు కాలీఫ్లవర్ ఇవ్వండని’ ఓ పోలీస్ అధికారి ట్వీట్ చేయగా... ‘సర్ క్యాలీఫ్లవర్ ఇచ్చినా కూడా నా ప్రియతమ ధర్మపత్ని నమ్మదు. కాబట్టి దాంతో పాటుగా ఓ సర్టిఫికెట్ కూడా అందిస్తే బాగుంటుందని’ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. మరికొంత మంది మాత్రం లక్నో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. -
లవ్ బిజినెస్
రెడ్ రోస్.. ప్రేమకు చిహ్నం! దాని ఖరీదు ఎంతో తెలుసా? ఒకే ఒక్క రోజా పువ్వు ధర..ఒక్క రోజు వంద రూపాయలు! టెడ్డీబేర్.. ప్రియురాలికి ఇష్టమైన సాఫ్ట్ టాయ్.. జానెడు బొమ్మ వెల ఆరడుగుల ప్రియుడిని బేర్మనేలా చేస్తోంది! లవర్స్‌ను ఊరించే కానుక ఉంగరం! కాని దాని కాస్ట్ ఇమిటేషన్స్లోనే వేలు పలుకుతుంటే ఖంగుమంటున్నారు! పెర్ఫ్యూమ్.. ప్రేమికులను దరిచేర్చే పరిమళం! ఒక్క స్ప్రేతో లవ్‌ను లాక్కుందామనుకుంటే ప్రైస్ ట్యాగ్ ముందుకు ప్రొసీడ్ కాకుండా లాక్ చేస్తోంది! ఏ శుభకార్యాన్నయినా తీపితో మొదలుపెట్టడం మన ఆనవాయితీ! అందుకే ఐ లవ్యూ అనే మంచి మాటను తియ్యగా చెబుదామంటే చాక్లేట్ ధర చేదు రుచిని తలపిస్తోంది! ఇక్కడ ఉదాహరణలే కాదు కానుకలనే ఊహల వెల కూడా ఆకాశానికి ఉయ్యాలేసి లవ్‌బర్డ్స్‌ను ఊరిస్తోంది అందుకోమని! తమ ప్రెషస్ ప్రేమ పారమీటర్ వందలు దాటి వెలకు చేరుతోంటే పట్టుకోవడానికి ప్లాన్ వేసుకుంటున్నారు ప్రేమికులు! అదే అదను అని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు! ఇది ప్రేమికుల రోజు కథ.. వాలంటైన్స్ డే స్పెషల్! ప్రేమించడానికి మనసుంటే సరిపోతుంది.. కానుకలెందుకు? బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి మాట ఇప్పుడు చెల్లదండీ! ఏ కానుకల్లేకుండా ప్రేమను పేలవంగా చెప్తే ఏం బాగుంటుంది? గిఫ్ట్స్‌తో గుబాళించాలి! అప్పుడే అవతలి వాళ్లు అట్రాక్ట్ అవుతారు అనేది కొత్త కాన్సెప్ట్! ప్రేమించడానికి ఇటు అబ్బాయిల జేబు, అటు అమ్మాయిల పర్స్ రెండూ నిండుగానే ఉండాలి. నిండుకుంటే లవ్ వే గేట్స్ మూసేసుకుంటుంది. వాలెంటైన్ జానపద గాథను ప్రేమకు చిరునామాగా మలచి వ్యాపారులు ఆ దారిని పరిస్తే మీడియా ట్రెండ్‌గా పాపులర్ చేసింది! ప్రేమికులు బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు! అందుకే ఇంతకుముందు గుట్టుచప్పుడు కాకుండా సాగిన ప్రేమాయణం ఇప్పుడు కాస్టీ›్ల వ్యవహారంగా సందడిచేస్తోంది.. కాసులను ఖర్చుపెట్టిస్తోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. ఎర్ర గులాబీ గుసగుసలు అన్ని డేస్లాగే పాశ్చాత్య ప్రపంచం వాలెంటైన్ డేనూ మూడో ప్రపంచం మీదకు వదిలింది. తన లవ్బిజినెస్ ఫార్ములాను ఆ దేశాల మార్కెట్‌కూ అందించింది. ఉత్పత్తులను దించింది. వీటికి ఎంత గిరాకీ అంటే ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్‌ను మరిచిపోయినా వాలంటైన్స్‌డే సెలబ్రేషన్స్‌ను మాత్రం గుర్తుపెట్టుకుంటోంది యూత్. వ్యాపారులకు కావాల్సిందీ అదే! వాలంటైన్స్డేను ఫేమస్ చేయడానికి పెట్టిన ఖర్చును అణాపైసలతో సహా రాబట్టుకుంటున్నాయి ఆ సంస్థలు. ఇదంతా ఓ పథకం.. ప్రణాళిక. వాటి జోలికి పోకుండా వాలంటైన్స్ డే రోజు డిమాండ్‌లో ఉన్న ఉత్పత్తులేంటి? వాటిని మార్కెట్లోకి వదిలిన శక్తులేంటో తెలుసుకుందాం! ఆ తొమ్మిది కంపెనీలు.. వాలంటైన్స్ డే లవ్బిజినెస్ ఐడియాను క్రియేట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసిందీ అమెరికానే! స్వీట్నథింగ్స్ను కరెన్సీ రేపర్లో చుట్టి ప్రేమికుల కళ్లబడేలా పేర్చింది. ఈ కష్టానికి క్రెడిట్ అమెరికాలోని 9 కంపెనీల ఖాతాలోనే జమవుతుంది. ది నేషనల్ రిటైల్ ఫెడరేషన్ (అమెరికా) లెక్క ప్రకారం వాలంటైన్స్ డే ఒక్కరోజే ఈ కంపెనీల లాభం లక్షా పదమూడు వేల తొమ్మిది వందల కోట్ల పై మాటే. 1-800 ఫ్లవర్స్, ది హర్షే కంపెనీ, హాల్మార్క్కార్డ్స్, నెకో, వెర్మోంట్ టెడ్డీ బేర్, విక్టోరియాస్ సీక్రెట్, టిఫనీ అండ్ కో, అర్మెల్లిని ఎక్స్ప్రెస్లైన్స్, ది యూఎస్ పోస్టల్ సర్వీస్ మొదలైన 9 కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి. 1-800 ఫ్లవర్స్... మోస్ట్ వాంటెడ్ ఫర్ లవర్స్ ఇది ప్రేమ గులాబీలు అంటే రెడ్రోజెస్ను, ఇతర కానుకలను అమ్మే సంస్థ. ఒక్క ప్రేమికులరోజు నాడే తన యేడాది ఆదాయం కన్నా పది శాతం అధిక సేల్స్ ఉంటాయి ఈ కంపెనీకి. గిఫ్ట్స్ ఆర్డర్ చేసిన లవర్స్‌కి క్షణం ఆలస్యం చేయకుండా అందించేందుకు వాలంటైన్స్‌డే ఒక్కరోజే అదనంగా ఆరువేల మంది వర్కర్స్‌ను అపాయింట్ చేసుకుంటుందంటే ఎంత డిమాండో అర్థం చేసుకోవచ్చు. ఆ ఖర్చుకి ఆరింతల లాభం వస్తుందని చెప్తాడు 1-800 కంపెనీ సీఈవో జిమ్ మెకాన్. యేటా 40 శాతం మంది కొత్త కస్టమర్స్ కూడా పెరుగుతారట. హర్షే ... కాక పుట్టించే చాక్లేట్ ఇది అమెరికన్ పాపులర్ చాక్లేట్స్ కంపెనీ. యేడాది మొత్తంలో కన్నా యాభై యాతం అధికంగా వాలెంటైన్స్‌డే రోజు హర్షేకి బిజినెస్ ఉంటుందట. హాల్‌మార్క్ కార్డ్స్.. గ్రీటింగ్స్కే హాల్‌మార్క్ వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ కార్డ్స్‌కి ఈ కంపెనీ ప్రసిద్ధమైంది. దాదాపు పధ్నాలుగువందల వాలంటైన్స్‌డే కార్డ్స్ డిజైన్స్‌ను క్రియేట్ చేసింది. స్టాటిస్టిక్ బ్రెయిన్ సర్వే ప్రకారం కిందటేడాది వాలంటైన్స్ డే రోజు 150 మిలియన్ల మంది హాల్‌మార్క్ కార్డ్స్‌ను తమ ప్రేమికులకు పంపారు. క్రిస్మస్ తర్వాత అంత పెద్దమొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టేది వాలెంటైన్స్ డేనే అని ఒప్పుకుంటుంది హాల్‌మార్క్ కార్డ్స్ యాజమాన్యం. నెకో.. లవ్స్ స్వీట్హార్ట్ క్యాండీస్ కంపెనీ. ఇది చతురస్రాకారం, బేస్బాల్స్, వాచెస్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేసినన్నాళ్లు దీనికి పెద్ద గిరాకీ లేదు. ఎప్పుడైతే పిప్పర్మెంట్ సైజులో హార్ట్‌షేప్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సప్లయ్ చేయలేనంతటి డిమాండ్ పెరిగిందట. దీన్ని వాలెంటైన్స్ డేకి యూఎస్పిగా ఎలా మలచుకోవాలో ఆలోచించమని మార్కెటింగ్ స్టాఫ్‌కి ఆర్డర్ వేసింది యాజమాన్యం. ఈ హార్ట్షేప్లోని క్యాండీస్ మీద ప్రేమికులకు సంబంధించిన సేయింగ్స్, కొటేషన్స్‌ను ముద్రించి మార్కెట్లోకి రాసులు పోశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షపౌండ్ల క్యాండీహార్ట్స్ను అమ్మి ఆదాయం గడిస్తోంది నెకో! వెర్మోంట్ టెడ్డీ బేర్.. వాలెంటైన్స్ డిమాండ్ ఈ కంపెనీ టెడ్డి బేర్ వరల్డ్ ఫేమస్. మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ కంపెనీ. వాలంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇది తయారు చేసే టెడ్డీకి ఎంత బెట్టంటే ఆర్నెల్ల ముందుగానే ఆర్డర్ ఇచ్చేంత. ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి వెర్మెంట్కి వాలెంటైన్స్ డే బిజినెస్ ఎంతో! విక్టోరియాస్ సీక్రెట్.. హాటెస్ట్ గిఫ్ట్ మాయిశ్చరైజర్స్, పెర్ఫ్యూమ్స్, లోదుస్తులు తయారు చేసే కంపెనీ ఇది. కాని లోదుస్తులకే బ్రాండ్ నేమ్ సంపాదించుకుంది. వాలెంటైన్స్ డే రోజు పాశ్చాత్య దేశాల్లోని ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలికి విక్టోరియాస్ సీక్రెట్ కంపెనీ లో దుస్తులు గిఫ్ట్‌గా ఇచ్చి తన ప్రేయసి మనసెరిగిన ప్రియుడిగా ముద్ర వేయించుకోవాలని తపనపడుతుంటాడట. రిచ్ బాయ్‌ఫ్రెండ్‌గా బిల్డప్ ఇవ్వాలనుకుంటాడట. ఈ లెక్కన ఆ ఒక్కరోజు ఈ కంపెనీ లాభాలెంతో అంచనాకు అందే ఉంటాయి కదా! టిఫనీ అండ్ కో.. జ్యుయెలరీ అందుకో మొదట ఇది స్టేషనరీ షాప్. తర్వాత వరల్డ్ ఫేమస్ జ్యుయలరీ కంపెనీ. వాలెంటైన్స్ డే రోజు ప్రతి ముగ్గురిలో ఒక పురుషుడు తన ప్రియురాలికో, భార్యకో టిఫనీ అండ్ కో జ్యుయలరీని ప్రెజెంట్ చేయాలనుకుంటాడు. ఆ రోజుకి తన సేల్స్ ఎంతో చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతుంది ఈ కంపెనీ. బిలియన్లలోనే ఆదాయం ఉంటుందంటారు మార్కెట్ విశ్లేషకులు. అర్మెల్లిని ఎక్స్‌ప్రెస్ లైన్స్ .. ప్రేమ డెలివరీ లైన్స్ పువ్వుల రవాణాలో పేరుమోసిన సంస్థ. వాలంటైన్స్ డే రోజు ఎర్రగులాబీలను పంపిణీ చేయడానికి రెండు నెలల ముందునుంచే సమాయత్తమవుతుంది. అదనంగా ట్రక్ డ్రైవర్స్‌ను నియమించుకుంటుంది. మామూలు రోజుల్లో కన్నా ప్రేమికుల రోజు నాడు నాలుగున్నరరెట్లు ఎక్కువుంటుంది దీని వ్యాపారం! యూఎస్ పోస్టల్ సర్వీస్.. సందేశాలను మోసుకొచ్చే సర్వీస్ మెయిల్స్, మొబైల్స్, వాట్సప్ మెస్సేజెస్ ఎన్ని ఉన్నా.. పోస్టల్ సర్వీస్‌లో వచ్చిన చిన్న కార్డుముక్క అందించే ఆనందం వేరు..ఆస్వాదించే దగ్గరి తనం వేరు. ఆ సంప్రదాయాన్నే నిలుపుతోంది ది యూఎస్ పోస్టల్ సర్వీస్. ప్రేమికుల అనురాగ సందేశాలను, ప్రేమ పలుకులను పొదువుకున్న గ్రీటింగ్ కార్డ్స్‌ను పదిలంగా పట్టుకొచ్చి అప్పజెప్పడంలో ది యూఎస్ పోస్టల్ సర్వీస్‌ను మించిన సర్వీసే లేదట. అందుకే వాలెంటైన్స్ డేకి వారం ముందునుంచే బిజీ అయిపోతుంది.. అయిదు నుంచి ఏడు శాతం అధికంగా వచ్చిపడే కార్డ్స్, ప్యాకేజెస్ అండ్ పార్సిల్స్‌తో. క్రిస్మస్ తర్వాత అంత పని, అంతేపెద్ద మొత్తంలో ఆదాయమూ వచ్చే పండగ ప్రేమికుల పండగే అని సంబరపడ్తోంది ఈ పోస్టల్ సర్వీస్ సంస్థ. నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్.. పాశ్చాత్య సమాజంలో వాలెంటైన్స్ డేను కేవలం జంటలే కాదు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్లాస్మేట్స్, టీచర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ధోరణి ఈసారి ఆసియా దేశాల్లోనూ కనిపించే అవకాశం ఉంది. వాలెంటైన్స్‌డే డెస్టినేషన్స్ గిఫ్ట్స్ తయారు చేసే కార్పోరేట్ సంస్థలు, ట్రావెల్ హౌజెస్ ప్రేమికుల రోజు కోసం కేరళ, గోవా, నైనిటాల్, మౌంట్ అబు, డెహ్రాడూన్, ముస్సోరి, కసౌలి, షిమ్లా, పంచవటి మొదలైన ప్రదేశాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌లను అందిస్తున్నాయి. వీటి ధర ఆరు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఉంటోంది. వాలెంటైన్స్ డే పిచ్చిని ఎయిర్‌లైన్స్ సంస్థలూ సొమ్ము చేసుకుంటు న్నాయి. విమాన చార్జీల్లో రాయితీలుస్తూ స్పెషల్హాళఇడే ప్యాకేజేస్తో గాల్లో విహరింపచేస్తున్నాయి. వాలెంటైన్స్ డే కథ నిజానికి ఇది ప్రేమపక్షుల కథ కాదు. స్నేహం కథ! తల్లిదండ్రులు-బిడ్డలు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, స్నేహితులు, రాజు - పేద, యజమాని- ఉద్యోగి మధ్య స్నేహాన్ని, ప్రేమను పెంచే కథ.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రేమమయం చేయమని చాటే ఓ సెయింట్ కథ. మూడో శతాబ్దంనాటి గ్రీకు కథ. రోమ్ చక్రవర్తి అయిన క్లాడియస్ 2 .. తాను నమ్మే పన్నెండు దేవతలను మాత్రమే పూజించాలని రోమన్లందరినీ ఆజ్ఞాపిస్తాడు. క్రిస్టియన్లతో ఎవరైనా సన్నిహితంగా మెదిలారని తెలిస్తే మరణశిక్ష ఖాయమనీ హెచ్చరిస్తాడు. కాని వాలెంటినస్ అనే సాధువు చక్రవర్తి మాటను చెవికెక్కించుకోడు. తన జీవితాన్ని క్రీస్తుకే అంకితం చేస్తాడు. దాంతో కన్నెర్ర చేసిన క్లాడియస్.. వాలెంటినస్‌ను జైల్లో పెట్టి మరణ శిక్ష విధిస్తాడు. ఆయనకు జూలియా అనే కూతురు ఉంటుంది. ఆమె పుట్టుకతో అంధురాలు. వాలెంటినస్ తన కూతురుకి అన్నీ నేర్పిస్తాడు. తనకళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వారం రోజుల్లో ఆ సాధువుకు మరణశిక్ష అమలవుతుందనగా జైలర్ ఆయన్ని అడుగుతాడు.. ‘నీ కూతుర్ని చూడాలనుకుంటున్నావా?’ అని. పిలిపిస్తాడు. జైల్లోంచే తన కూతురుకి జీవన సత్యాలు బోధిస్తుం టాడు. ఆ జ్ఞానంతో జూలియాకు చూపు వస్తుంది. చివరకు తాను చనిపోయే ముందు రోజు జూలియాకు ఓ ఉత్తరం రాస్తాడు.. ‘దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని! ఆ తర్వాత రోజు అంటే క్రీ.శ. 270, ఫ్రిబవరి 14న వాలెంటినస్కు మరణశిక్ష అమలవుతుంది. తన తండ్రిని సమాధి చేసిన చోట గులాబిరంగులో పూత పూసే బాదం మొక్క నాటుతుంది ఆమె. ఆ మొక్క తర్వాత కాలంలో వృక్షమై ప్రేమ, స్నేహానికి చిహ్నంగా నిలిచింది అంటారు. ఆ ప్రేమను, స్నేహాన్ని ప్రపంచానికి చాటడానికే ప్రతి ఫిబ్రవరి 14న వాలెంటినస్ పేరుమీద వాలెంటైన్స్ డేని జరుపుకోవడం మొదలుపెట్టింది ప్రపంచం. -
ప్రేమతో.. గులాబి
ప్రేయసి చూపు గుండెల్లో గులాబీ ముల్లులా గుచ్చుకుంటుంది. ప్రేయసి నవ్వు.. గులాబీ గుబాళింపులా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రేయసి అందం.. గులాబీ సోయగంలా మైమరిపిస్తుంది. ప్రేయసి స్పర్శ.. గులాబీ రేకులా సుతిమెత్తగా అనిపిస్తుంది. ప్రియురాలికి సంబంధించిన ప్రతి విషయంలోనూ గులాబీ ఎందుకు జొరబడుతుంది ?! ఎందుకంటే... ప్రేమ ఉన్నచోట గులాబీ ఉంటుంది. అది కూడా ఎర్రగులాబీ !! నగరంలోని నవయువ హృదయాలను ప్రేమమయం చేస్తున్న గులాబీల సందడికి మళ్లీ రెక్కలొచ్చాయి. ..:: సమీర నేలపూడి వాలంటైన్స్‌డే వచ్చిందంటే చాలు, ఎర్ర గులాబీ ప్రేమను మోసుకెళ్లే పల్లకీగా మారుతుంది. ప్రేమికుడి హృదయాన్ని తీసుకెళ్లి ప్రేయసి చేతుల్లో భద్రంగా పెట్టే బాధ్యతను నెత్తినేసుకుంటుంది. ఇరు హృదయాల మధ్య రాయబారం నడుపుతుంది. చెలి చెక్కిళ్లలోని అరుణిమను నిలువెల్లా పరుచుకున్న ఆ పుష్పం.. ప్రేమికులకు ప్రత్యేకం. అందుకే ఎర్రగులాబీకి ప్రేమ సామ్రాజ్యంలో సుస్థిరమైన స్థానముంది. అది ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయింది. చరిత్ర పుటల్లోకెక్కింది. ‘రోజ్ డే’ పేరిట తనకంటూ ‘వాలంటైన్ వీక్’లో తొలి రోజును తన పేర క్యాలెండర్లో పదిలపరచుకుంది. ప్రేమ కథే నేపథ్యం... తెలుపు, పసుపు, గులాబీ, నారింజ.. ఇలా రంగురంగుల గులాబీలు ఎన్నున్నా.. ఎర్ర గులాబీకి ఉండే హోదానే వేరు. ఈ పుష్పరాజం కొన్ని శతాబ్దాలుగా ప్రేమికుల ప్రియనేస్తంగా వెలుగుతోంది. నిజానికి ఎర్ర గులాబీకి ప్రేమ గుబాళింపు అద్దిన ఘనత... అందాలరాశి క్లియోపాత్రాది అంటారు చరిత్రకారులు. ఆంటోనీ మీద మనసు పడిన క్లియోపాత్రా, అతనిని చేరుకోవడం కోసం ఎర్రగులాబీలతో ఓ కార్పెట్‌ను తయారు చేయిస్తుంది. దానిలో తనను చుట్టి ఆంటోనీ దగ్గరకు తీసుకెళ్లమని చెలికత్తెలతో చెబుతుంది. వాళ్లు కార్పెట్‌ను తీసుకెళ్లి ఆంటోనీ ముందు పరిచినప్పుడు... ఎర్రగులాబీల మధ్య నుంచి దొర్లి ఆంటోనీ పాదాల వద్దకు చేరుతుంది. ఆ గులాబీలతో పోటీ పడే ఆమె కోమలత్వాన్ని, ముగ్ధ మనోహర రూపాన్నీ చూసి మైమరచిపోయిన ఆంటోనీ.. ఆమెకు తన హృదయంలో శాశ్వత స్థానాన్ని కల్పించాడు. నాటి నుంచీ ప్రేమతోను ప్రేమికులతోను ఎర్రగులాబీకి ముడిపడిందని చెబుతుంటారు. నేటికీ ప్రేమికుల చేతుల్లో ప్రేమకు గుర్తుగా ఇవి కనిపిస్తూ ఉండటమే అందుకు సాక్ష్యం. రోజా రోజు.. తమ మనసులోని ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమైన ప్రతి ఒక్కరూ మొదట వెతికేది ఎర్రగులాబీ కోసమే. ఇంత ప్రాముఖ్యం ఉంది కనుకనే.. రోజ్ డే అంటూ ఓ రోజును ఏర్పరిచారు. ఏటా ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి.. ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు) ముగిసే వరకు సిటీలో ఎర్రగులాబీల మీద లక్షల్లో వ్యాపారం జరుగుతుందంటే రెడ్ రోజెస్‌కు ప్రేమికులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాలెంటైన్స్‌డేకు కొన్ని రోజులు ముందుగానే ప్రతి రోజూ గులాబీలతో పలకరించడం వంటి రోజ్ హాబీస్ ఉన్న సిటీ యువత ప్రేయసి కోసం రోజుకో రోజాని పంపుతున్నారు. విడిపూలు అయితేనేమి, గుత్తుల రూపంలో అయితేనేమి.. ఎర్రగులాబీలు ప్రేమికుల చేతుల్లో ఒదిగిపోయి, వారు ప్రేమించిన వాళ్ల చేతుల్లోకి శరవేగంగా చేరిపోతున్నాయి. యుగాలు గడచినా, తరాలు మారినా.. తాము లేకపోతే ప్రేమ లేదని, ప్రేమికుల రోజే లేదని గర్వంగా చాటుతున్నాయి. వారం రోజులు.. ఎన్ని రకాల గులాబీలు ఉన్నా ఎర్ర గులాబీ ప్రత్యేకతే వేరు. బెంగళూరు, పూణె ప్రాంతాల నుంచి తీసుకొస్తాం. వాలంటైన్ డే దగ్గర పడుతుందంటే రోజ్ల అమ్మకాలు బాగా పెరుగుతాయి. కొన్ని రోజుల ముందు నుంచే ఆర్డర్స్ వస్తుంటాయి. ఈ వారం రోజులు పండుగనే చెప్పాలి. ప్రేమికుల రోజు వెళ్లిపోయిన తర్వాత అమ్మకాలు షరామామూలే. - రమేశ్, పూల వ్యాపారి, మెహదీపట్నం మీరు ఇచ్చే గులాబీల సంఖ్య... మీరు చెప్పాలనుకున్న విషయాన్ని అవతలి వారికి తేలికగా చేరవేస్తుంది. ఎన్ని గులాబీలు ఇస్తే మనం ఏం చెబుతున్నట్టో ఓ లెక్క ఉందంటూ సిటీలోని పుష్పాలంకరణ నిపుణులు సరికొత్త సుమసూత్రాలు చెబుతున్నారు. వీటిని తెలుసుకునేందుకు సిటీ యువత ఆసక్తి చూపుతున్నారు. వాటిలో కొన్ని... 1 గులాబీ ఇస్తే - తొలిచూపులోనే నిన్ను ప్రేమించాను 2 గులాబీలు - మనిద్దరి ఆలోచనలూ ఒకటే 3 గులాబీలు - నేను నిన్ను ప్రేమిస్తున్నాను 7 గులాబీలు - నీ ప్రేమలో పిచ్చివాణ్నవుతున్నాను 9 గులాబీలు - జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉందాం 10 గులాబీలు - నువ్వు నా సొంతం 12 గులాబీలు - నీకు జీవితాంతం తోడుంటాను 21 గులాబీలు - నేను నీకు కట్టుబడి ఉంటాను 100 గులాబీలు - నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను 108 గులాబీలు - నన్ను పెళ్లి చేసుకుంటావా? -
ఏనుగమ్మా.. బొమ్మేసిందమ్మా...
ఎర్ర గులాబీ పూల మొక్క.. చక్కని పెయింటింగ్.. అయితే దీన్ని వేసింది ఓ ఏనుగంటే మీరు నమ్మగలరా? ఏదో పిచ్చిపిచ్చి గీతలు తప్ప అవేమి వేయగలవు అని భావించేవారు.. థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్లో ఉన్న ఎలిఫెంట్ క్యాంప్‌లో ఉన్న గజరాజులను చూసి డంగైపోవాల్సిందే.. ఒక్కోటి.. ఒక్కో ఎంఎఫ్ హుస్సేన్ తరహాలో బ్రష్ పట్టుకుని.. చిత్రాలు ఎడాపెడా గీసేస్తాయి. ఇక్కడ మొత్తం ఏడు ఏనుగులు చిత్రకళలో ఆరితేరాయి. ఈ చిత్రాలను అమ్మితే.. ఒక్కోటి రూ.1.3 లక్షల దాకా పలికాయి.