ఫేస్‌బుక్ లాభాలు.. రూ. 4300 కోట్లు!
సామాజిక వెబ్‌సైట్లలో బహుళ ప్రాచర్యం పొందిన ఫేస్బుక్ రోజు రోజుకు తన వినియోగదారులను పెంచుకోవడంతోపాటు లాభాల్లో కూడా దూసుకెళుతోంది. నాలుగో క్వార్టర్లో ఏకంగా 4300 కోట్ల రూపాయల (701 మిలియన్ డాలర్ల) లాభాలను సాధించడం విశేషం. ఇది గత ఏడాది నాలుగవ త్రైమాసికంలో సాధించిన లాభాలకన్నా 34 శాతం అధికం. ఈ త్రైమాసికంలో వ్యాపార ప్రకటనల రెవె న్యూ 53 శాతం పెరగడం అధిక లాభాలకు దోహదపడింది. 53 శాతమంటే 3. 59 డాలర్ల రెవెన్యూ పెరిగినట్టు. ఇందులో 70 శాతం రెవెన్యూ కేవలం మొబైల్ వ్యాపార ప్రకటన వల్లనే వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలియశాయి.
ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు యాక్టివ్ వినియోగదారులు 1.39 బిలియన్ మంది ఉన్నారు. ఏడాదికేడాది వీరి సంఖ్య 13 శాతం పెరుగుతూ వస్తోందని, 2014 సంవత్సరానికి మొత్తానికి 2.9 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయని, ఇది 2013 సంవత్సరానికి వచ్చిన మొత్తం లాభాలకు దాదాపు రెట్టింపని ఫేస్‌బుక్ సీఈఓఫే మార్క్ జుకర్‌బెర్గ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నికర లెక్కల్లే చూస్తే మాత్రం కంపెనీకి ప్రతి డాలర్‌పై వచ్చే లాభం గతేడాదితో పోలిస్తే 44 శాతం నుంచి 29 శాతానికి పడిపోయిందని, దానికి కారణం ‘పరిశోధన- అభివృద్ధి, మార్కెటింగ్‌పై ఎక్కువ పెట్టుబడులు పెట్టటమే కారణమని ఆయన వివరించారు. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసిక కాలంలో ‘పరిశోధన-అభివృద్ధి’ కి నిధులను మూడింతలు పెంచామని, అంటే దాదాపు 1.1 బిలియన్ డాలర్లను వెచ్చించామని తెలిపారు.