న్యూయార్క్: అసత్యాలు, పుకార్లనే జనం తొందరగా నమ్ముతారనే విషయం మరోసారి రుజువైంది. సామాజిక మాధ్యమం ట్వీటర్‌లో తప్పుడు రాజకీయ వార్తలు ఎక్కువ వేగంగా, ఎక్కువమందికి చేరుతున్నాయనీ, వాటినే నమ్ముతున్నారనీ ఓ సర్వేలో తేలింది. ఈ అధ్యయనం చేప ట్టిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సొరొష్ వొసౌఘి ఈ వివరాలు వెల్లడించారు. ట్వీటర్‌లో వచ్చే వార్తల్లో అధికశాతం పుకార్లు, తప్పుడు వార్తలేనని రుజువైందని చెప్పారు. తప్పుడు వార్తలను ఎక్కువ మంది నమ్మి రీట్వీట్ చేస్తున్న కారణంగానే అవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
దీని కోసం ట్వీటర్‌లో 2006–2017 మధ్య కాలంలో వచ్చిన 1,26,000 వార్తా కథనాలను పరిశీలించగా వీటిని దాదాపు 30 లక్షల మంది 45లక్షల సార్లు రీట్వీట్ చేసినట్లు గుర్తించారు. సమాచారాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి చూసి నా..తప్పుడు సమాచారమే ఎక్కువ వేగం గా, ఎక్కువ మంది, ఎక్కువ సా ర్లు ట్వీట్ చేసినట్లు తేలింది. నిజమైన సమాచా రం కంటే తప్పుడు వార్తా సమాచారమే 70%వరకు రీట్వీట్ అయ్యింది. వాస్తవ వార్త 1500 మందికి చేరటానికి పట్టే సమయంలో ఆరోవంతు సమయంలోనే తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment