లండన్: సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు బ్రిటన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈయూ రెఫరెండంలో రష్యా జోక్యంపై విచారణ చేపడుతున్న బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీకి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారనే ఆరోపణలకు సంబంధించి అవసరమైన సమాచారం ఇవ్వడంలో విఫలమైతే ఇరు సంస్థలపై ఆంక్షలు విధిస్తామని బ్రిటన్ హెచ్చరించింది. కమిటీ కోరిన సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు జనవరి 18లోగా అందచేయాలని డెడ్‌లైన్ విధించినట్టు సమాచారం.
కమిటీ కోరిన సమాచారం ఇవ్వడంలో విఫలమైతే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లపై ఎలాంటి ఆంక్షలు విధించాలనేది పార్లమెంటరీ కమిటీ నిర్ణయిస్తుందని బ్రిటన్ అధికారులు తెలిపారు. అవసరమైతే సోషల్ మీడియా వేదికలపై ప్రకటనలను నిలిపివేసే అంశాన్నీ కమిటీ పరిశీలిస్తుందని ఫేక్‌న్యూస్ వ్యవహారంపై విచారణ నిర్వహిస్తున్న డీసీఎంఎస్ సెలెక్ట్ కమిటీ చీఫ్ డొమిన్ కొల్లిన్స్ చెప్పారు. ఈయూ రెఫరెండం సందర్భంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను రష్యా ఉపయోగించుకుందనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment