'ఆ ఉగ్ర సంస్థకు భారత్‌లోనూ సంబంధాలు'
'ఆ ఉగ్ర సంస్థకు భారత్‌లోనూ సంబంధాలు'
Published Sun, Aug 21 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
న్యూఢిల్లీ: టర్కీలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి విఫలయత్నం చేసిన సంస్థ.. ఫతుల్లా గులెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఈటీవో) భారత్‌లో సైతం చొరబడి ఉందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కవుసోగ్లు వెల్లడించారు. ఎఫ్ఈటీవోకు ప్రపంచ వ్యాప్తంగా రహస్య నెట్‌వర్క్ ఉందని.. భారత్‌లో ఉన్నటువంటి కొన్ని సంస్థలతో దానికి సంబంధాలున్నాయని అన్నారు. భారత పర్యటనలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో తాను ఈ విషయంపై మాట్లాడానని తెలిపారు.
గులెన్ సంస్థతో సంబంధాలున్న సంస్థలు, వ్యక్తులపై అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని.. వారి కార్యకలాపాలు తమ భూభాగాల నుంచి జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కవుసోగ్లు కోరారు. అయితే టర్కీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ.. టర్కీ ప్రస్తావించిన అంశాలు చాలా సున్నితమైనవి అన్నారు. ఎఫ్‌ఈటీవోతో సంబంధాలు నడుపుతూ.. నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలను భారత భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయన్నారు. టర్కీ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటులో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గులెన్ అమెరికాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
Advertisement