
వైరల్ వీడియో: పట్టపగలు 39కిలోల బంగారం చోరీ
న్యూయార్క్: పట్టపగలే అందరూ చూస్తుండగా అత్యంత సునాయాసంగా ఓ దుండగుడు భారీ దోపిడి చేశాడు. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజీని న్యూయార్క్ పోలీసులు విడుదల చేశారు. సాయుధులతో ఉన్న ట్రక్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా అత్యంత చాకచక్యంగా 39 కిలోల (86 పౌండ్లు బంగారం) బంగారం ఉన్న బకెట్ ను దోచుకెళ్లాడు. దాదాపు దీని విలువ 1.6 మిలియన్ యూఎస్ డాలర్లు(దాదాపు రూ.11 కోట్లు) ఉంటుంది.
ఈ సంఘన రెండు నెలల కిందట అమెరికాలోని మాన్ హట్టన్లో చోటుచేసుకుంది. దుండగుడు ఫ్లోరిడాకు తప్పించుకొని పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారాన్ని క్షణాల్లో చోరీ చేసిన అగంతకుడు గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పించుకున్న దృశ్యాలను ఈ వీడియో ఫుటేజీలో చూడొచ్చు.