దారుణాల్లోకెల్లా దారుణం! | former government official DELIBERATELY ploughs through group of school children in deadly hit and run in China | Sakshi
Sakshi News home page

దారుణాల్లోకెల్లా దారుణం!

Published Wed, Mar 2 2016 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

దారుణాల్లోకెల్లా దారుణం!

దారుణాల్లోకెల్లా దారుణం!

చైనాలో ఓ మాజీ ప్రభుత్వాధికారి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సమాజంపై కోపంతో అభంశుభం తెలియని చిన్నారులపై ప్రతీకార దాడికి దిగాడు. ఉద్దేశపూర్వకంగా పాఠశాల విద్యార్థులపైకి కారుతో దూసుకెళ్లి.. బీభత్సం సృష్టించాడు. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని నాన్యాంగ్‌ లో సోమవారం మిట్టమధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా.. 11 మంది ముక్కుపచ్చలారని పసిపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కిరాతకమైన దాడికి పాల్పడ్డ 'మా' (ఇంటిపేరు) అనే వ్యక్తి సంఘటనా స్థలం నుంచి వెంటనే పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని వెంటాడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై దర్యాప్తు చేసే నాన్యాంగ్ సిటీ పీపుల్ విభాగంలో పనిచేసిన 'మా' ఓ రిటైర్డ్ దర్యాప్తు అధికారి. సమాజం తీరుపై అసంతృప్తి చెందిన అతను ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న విద్యార్థుల సమూహంపై బీవైడీ మోడల్ వాహనంతో అతడు దూసుకుపోయాడు. విద్యార్థుల లక్ష్యంగా తన కారును వేగంగా నడుపడంతో దాదాపు 12 మంది చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

ఈ బీభత్సంతో బిత్తరపోయిన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఒక విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. తీవ్ర గాయాలైన 11 మందికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కేవలం విద్యార్థుల లక్ష్యంగానే అతను కారు వేగంగా నడిపినట్టు స్పష్టం చేస్తోంది. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటనతో స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు షాక్ తిన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement