ఐసిస్‌పై ప్రేమతో ఆ బాలిక పోలీసును పొడిచి.. | German girl jailed for IS attack in Hanover | Sakshi
Sakshi News home page

ఐసిస్‌పై ప్రేమతో ఆ బాలిక పోలీసును పొడిచి..

Published Thu, Jan 26 2017 5:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

ఐసిస్‌పై ప్రేమతో ఆ బాలిక పోలీసును పొడిచి..

ఐసిస్‌పై ప్రేమతో ఆ బాలిక పోలీసును పొడిచి..

జర్మనీ: సాధారణంగా ప్రతిసారి ఉగ్రవాదులు దాడి చేస్తుంటారు. వారు సృష్టించే మారణకాండను సామాన్యులు అసహ్యించుకుంటారు. వారిపట్ల సానుభూతి అనేది ఏ ఒక్కరికీ ఉండదు. కానీ తొలిసారి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రభావానికి గురై, వారిపై సానుభూతితో ఓ పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన బాలికను జర్మనీ పోలీసులు కటకటాల్లోకి పంపించారు. దాదాపు ఆరేండ్ల కాలంపాటు ఆ బాలిక జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే..

జర్మనీలోని హనోవర్‌ ప్రాంతంలో సఫియా ఎస్‌ అనే బాలిక 16, (దాడి చేసే సమయంలో 15 ఏళ్లు) ఇస్లామిక్‌ స్టేట్‌ భావాజాలానికి ప్రేరేపితురాలై వారిపై సానుభూతితో ఓ పోలీసు అధికారిని కత్తితో దారుణంగా పొడిచి గాయాల పాలు చేసింది. ఆ బాలిక అలా దాడి చేయడానికి గల కారణాలను ప్రశ్నించగా తాను ఉగ్రవాద సంస్థను కాపాడేందుకు ఈ పనిచేసినట్లు తెలిపింది. దీంతో ఆ బాలికను అరెస్టు చేసి విచారణ అనంతరం కోర్టుకు తీసుకెళ్లగా ఆరేళ్ల శిక్ష పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement