'గొంతులో పొడిచి హెచ్చరించాడు' | Teacher attacked in Paris suburb by man 'citing Islamic State': Police | Sakshi
Sakshi News home page

'గొంతులో పొడిచి హెచ్చరించాడు'

Published Mon, Dec 14 2015 5:42 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

'గొంతులో పొడిచి హెచ్చరించాడు'

'గొంతులో పొడిచి హెచ్చరించాడు'

పారిస్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి పారిస్ కు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డాడు. బాక్స్ కట్టర్ తో ఆ టీచర్ గొంతులో పొడిచాడు. అనంతరం ఇది వార్నింగ్ మాత్రమే అంటూ హెచ్చరిస్తూ గట్టిగా కేకలు వేస్తూ పారిపోయాడు. ప్రస్తుతం ఆ టీచర్ ఆరోగ్య పరిస్థితి కుదురుగానే ఉంది.

ఈశాన్య పారిస్ లోని అబర్ విల్లర్స్ లో టీచర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బోధించేందుకు తరగతి వెళ్లేందుకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా రంగులు వేసే వ్యక్తిగా చేతిలో ఓ డబ్బాతో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. అతడి చేతిలో ఏ ఆయుధము లేదు. కానీ, అక్కడే ఓ మూలకు ఉన్న బాక్స్ కట్టర్ (పెద్ద కత్తెర)ను తీసుకొని వేగంగా ఆ టీచర్ గొంతులో పొడిచాడు. ఈ వెంటనే 'దిస్ ఈజ్ డాయిష్. ఇది హెచ్చరిక మాత్రమే' అంటూ కేకలు వేసి వెళ్లిపోయాడు. డాయిష్ అనగా ఇస్లామిక్ స్టేట్ సంస్థకు గల మరో పేరు. దీంతో అతడు కచ్చితంగా ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement