వరదల్లో కొట్టుకొచ్చిన భారీ మొసలి.. పట్టేశారు | Giant Crocodile caught in Huston Floods Home | Sakshi
Sakshi News home page

వరదల్లో కొట్టుకొచ్చిన భారీ మొసలి.. పట్టేశారు

Published Sat, Sep 2 2017 10:41 AM | Last Updated on Tue, Sep 12 2017 1:39 AM

Giant Crocodile caught in Huston Floods Home





సాక్షి, టెక్సాస్:
అమెరికాను హర్వే తుఫాన్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన తుఫాన్‌గా అభివర్ణించబడ్డ హర్వే ధాటికి నాశనం అయిన ప్రాంతాల్లో టెక్సాస్‌ నగరం కూడా ఉంది. వర్షాలు తెరిపినివ్వటంతోపాటు వరద తగ్గుముఖం పట్టడంతో బ్రెయిన్ ఫోస్టర్‌ అనే వ్యక్తి హర్రీస్‌ కంట్రీలోని తన ఇంటికి బయలేదేరాడు. 
 
జరిగిన నష్టాన్ని తల్చుకుని బాధపడుతూనే పని వాళ్లతో ఇంటిని శుభ్రం చేయిస్తున్నాడు. ఇంతలో డైనింగ్ టేబుల్ కింద దృశ్యాన్ని చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. 9 అడుగుల ఓ భారీ మొసలి తాపీగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ షాక్‌ నుంచి తేరుకున్న ఫోస్టర్ వెంటనే అత్యవసర సిబ్బందికి కాల్ చేశాడు. 
 
తమకు అందిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు 20 నిమిషాలపాటు శ్రమించి ఆ భారీ మకరాన్ని బంధించేశారు. సమీపంలో కొలను ప్రాంతంలో మొసలిని విడిచిపెడతామని అధికారులు తెలిపారు. గత వారం టెక్సాస్ లోనే ఓ మహిళ రెండు మొసళ్లు వదరల్లో ఈదుకుంటూ రావటం చిత్రీకరించి ఆ భయానక దృశ్యాలను సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్ చేసింది. 
 
కాగా, హర్వే హరికేన్ మూలంగా వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తగా.. వరద నీటితోపాటు జంతువులు కూడా కొట్టుకుని వస్తున్నాయి. ఒక్క హుస్టన్‌ నగరంలోని జలప్రాణి సంరక్షణ కేంద్రం నుంచే 350 జంతువులు తప్పిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement