ఫేస్బుక్, గూగుల్ కు షాక్ | Google, Facebook, YouTube receive tax notices in Pakistan | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్, గూగుల్ కు షాక్

Published Fri, Jun 10 2016 7:42 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్, గూగుల్ కు షాక్ - Sakshi

ఫేస్బుక్, గూగుల్ కు షాక్

లాహోర్: ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లకు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూన్ 17లో రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. పంజాబ్-స్పెసిఫిక్ వాణిజ్య ప్రకటనలకు పన్ను చెల్లించాలని కూడా సూచించింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వ రెవెన్యు శాఖ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది.

గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ తో పాటు డైలీ మోషన్, స్థానిక వెబ్ సైట్ ముక్తాబిట్ డాట్ కామ్ కు వేర్వేరుగా నోటీసులు పంపింది. పంజాబ్ సేల్స్ ట్యాక్స్- సర్వీసెస్ యాక్ట్ 2012 కింద ఈ నెల 17లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటీసుల్లో సూచించింది. తమ ప్రాంతంలో పన్నులతో కూడిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ట్యాక్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించకుంటే ఈ వెబ్సైట్లను నిషేధించాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ శాఖను కోరతామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement