గురుత్వ తరంగాలు సిక్త్ సెన్స్ను కలిగించనున్నాయా..!
కోల్కతా: వందేళ్ల కింద ఐన్స్టీన్ చెప్పిన మాటలు మొన్న నిజమయ్యాయి.. మరి, ఇప్పుడు అవే గురుత్వ తరంగాలు విశ్వం గురించే ముందే ఊహించే శక్తిని మనుషులకు ఇస్తాయని చెప్తున్న యూఎస్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ విద్యార్ధుల మాటలు నిజమవుతాయా?
ఏ టెలీస్కోప్ ఇప్పటివరకు ఇవ్వని వివరాలను ఈ తరంగాలు సమయానుకూలంగా చేసే కంపనాల ద్వారా జగత్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని పరిశోధనా విద్యార్ధులు కరణ్ పీ జానీ, నాన్సీ అగర్వాల్లు చెబుతున్నారు. విడిగా ఉన్నబ్లాక్ హోల్ కన్నా, పెద్ద బ్లాక్ హోల్(రెండు) కలిసినపుడు పరిశీలించడం వల్ల అవి విడుదల చేసే శక్తి విశ్వంలోని అన్ని నక్షత్రాల శక్తికి 50 రెట్లు అధికంగా ఉంటుందని లిగో డేటాలో పెద్ద బ్లాక్ హోల్స్ ఢీ కొన్న సమాచారాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా పరిశీలించే జానీ తెలిపారు.
విడుదలయ్యే శక్తిని ఎలా కనుగొంటారు..
రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంతి వనరులు విడుదల చేసిన కాంతులు ఒకదానితో ఒకటి ఢీ కొన్నపుడు విడుదలయ్యే శక్తిని ఇంటర్ఫెరోమీటర్లను ఉపయోగించి గమనించవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో విడుదలయ్యే కాంతులు ఢీ కొనడాన్ని లిగో మీటర్ల ద్వారా కచ్చితమైన వివరాలు వస్తాయని వీటిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సివుందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధక విద్యార్ధిగా పనిచేస్తున్న అగర్వాల్ తెలిపారు.
ప్రస్తుతం దాదాపు 16దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 1000మంది బ్లాక్ హోల్స్ విడుదల చేసే గురుత్వ తరంగాల మీద పరిశోధనలు చేస్తున్నారు. వీరిలో అధికంగా సభ్యులను కలిగి ఉన్న దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉంది. భారత్, అమెరికా దేశాలు మార్చి,2016లో చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత్లో లిగో ఇండియా ప్రాజెక్టు త్వరలో ప్రారంభంకానుంది. ప్రస్తుతం క్వాంటమ్ మెకానిక్స్ చదువుతూ గురుత్వ తరంగాలను కనిపెట్టగలిగే డిటెక్టర్ల తయారీలో భాగస్వామిగా ఉన్నఅగర్వాల్ లిగో ఇండియా ప్రాజెక్టు భావిభారత శాస్త్రవేత్తలకు గొప్ప అవకాశాలను ఇస్తుందని అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ 14న గురుత్వ తరంగాలను లుసియానాలోని లివింగ్స్టన్లోని లిగో డిటెక్టర్లు కనుగొన్న విషయం తెలిసిందే.