హేలీ.. రెండు పెంపుడు పులులు! | Haley .. two pet tigers! | Sakshi
Sakshi News home page

హేలీ.. రెండు పెంపుడు పులులు!

Published Tue, May 27 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

హేలీ.. రెండు పెంపుడు పులులు!

హేలీ.. రెండు పెంపుడు పులులు!

పులితో కలసి హాయిగా నిద్రపోతున్న ఈమె పేరు జేనిస్ హేలీ. ఫ్లోరిడాలోని ఓర్లాండో నివాసి. సాధారణంగా చాలామంది ఏ కుక్కనో, పిల్లినో పెంచుకుంటారు. కానీ హేలీ మాత్రం ఏకంగా పులులను పెంచుకుంటున్నారు. జండా అనే ఈ ఆడ బెంగాల్ టైగర్‌తోపాటు సబర్ అనే మగ తెల్లపులి కూడా ఈమె ఇంట్లో ఉంది. ఈ రెండు వ్యాఘ్రాల కోసం 57 ఏళ్ల హేలీ తన పెరట్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. రోజూ వాటి పనులన్నీ స్వయంగా చూసుకుంటారు. తిండి తినిపించడం దగ్గర నుంచి నిద్రపుచ్చడం వరకు అన్నీ చేస్తారు. అడ్మిన్ అసిస్టెంట్‌గా పనిచేసిన హేలీ.. 20 ఏళ్ల క్రితం తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి పులుల శిక్షణ కోర్సులో చేరారు. రెండేళ్ల తర్వాత చ ప్ఫర్ అనే పులి పిల్లను ఇంటికి తీసుకొచ్చి పెంచుకోవడం ప్రారంభించారు.

2002లో దానికి జతగా జండాను తీసుకొచ్చారు. 2007లో చప్ఫర్ చనిపోవడంతో రెండు వారాల వయసున్న సబర్‌ను జండాకు పరిచయం చేశారు. ప్రస్తుతం జండా వయసు 12 ఏళ్లు. ఈ రెండు బెంగాల్ వ్యాఘ్రాలు ఆ ఇంట్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదండోయ్. హేలీ పెంపుడు కుక్కతో కూడా ఇవి ఆడుకుంటాయి. ఇక హేలీకి, వీటితో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేం. అంతగా ఇవి రెండూ ఆమెతో కలిసిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement