31న నవాజ్ షరీఫ్‌కు గుండె శస్త్రచికిత్స | Heart surgery to Nawaz Sharif On 31st | Sakshi
Sakshi News home page

31న నవాజ్ షరీఫ్‌కు గుండె శస్త్రచికిత్స

Published Sat, May 28 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

Heart surgery to Nawaz Sharif On 31st

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు మంగళవారం లండన్‌లో గుండె శస్త్రచికిత్స చేయనున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాలన్న వైద్యుల సలహా మేరకే ఈ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. శస్త్రచికిత్స కోసం వారంపాటు షరీఫ్ ఆస్పత్రిలోనే ఉంటారని, వైద్యుల అనుమతితోనే తిరిగి వస్తారని ఆయన తెలిపారు. షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ కూడా ట్విటర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని, అప్పుడే ఆయన ఆరోగ్యంగా ఉంటారంటూ ఆమె ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement