లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్ టైమ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది.
2017 ఏడాదికిగానూ ది న్యూయార్క్ టైమ్స్ 11 మంది మహిళల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయగా.. అందులో మరయమ్‌కు చోటు దక్కింది. తండ్రి షరీఫ్ కుడి భుజంగా వ్యవహరిస్తూ పాక్ రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పించింది. ముఖ్యంగా ఎన్‌ఏ-120 నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమె చేసిన ప్రచారం గురించి ప్రముఖంగా ప్రచురించింది. ఆ ప్రభావంతోనే ఆ స్థానంలో నవాజ్ భార్య కుల్సుం నవాజ్ ఘన విజయం సాధించారని తెలిపింది.
కాగా, పనామా పత్రాల ఆరోపణలతో షరీఫ్ గద్దెదిగి పోగా.. పార్టీ వ్యవహారాలను మరయమ్ చూసుకుంటున్నారు.. ఇక న్యూయార్క్ టైమ్స్ లిస్ట్‌లో ఉన్న మరికొందరు. హెండా అయారి, మార్గొట్ వాల్‌స్ట్రోమ్, యూ క్సియుహువా, మనాల్ అల్ షరీఫ్, ఎమ్మా మోరానో, ఓలైవ్ యాంగ్, అస్లి ఎర్దోగన్, లెటిజియా బట్టగ్లియా, సింటా నూరియా, అలైస్ స్చ్వార్జర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment