powerful women
-
‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
న్యూయార్క్: అమెరికా బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ వార్షిక జాబితాలో ఆరుగురు భారతీయులకు స్థానం దక్కింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(36), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా(ర్యాంకు 72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్(ర్యాంకు 89), హెచ్‌సీఎల్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (ర్యాంకు 53), సెబీ చైర్పర్సన్ మాధవీ పూరి (ర్యాంకు 54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండాల్ (ర్యాంకు 67) ఈ జాబితాలో చోటు సాధించారు. -
నిర్మలా శక్తి రామన్!
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది. ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు ఈ జాబితాలో స్థానం లభించింది. హెచ్‌సీఎల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్, సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా 54వ స్థానంలో నిలిచారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందార్ షా బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నికర సంపద రూ.310 కోట్ల అమెరికా డాలర్లు (2019). దేశంలోనే అతిపెద్ద బయోఫార్మాసూటికల్ కంపెనీ ఏర్పాటుచేసి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రోష్ని నాడార్ విషయానికొస్తే, ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ (2019) ప్రకారం, భారత్‌లోనే అత్యంత మహిళా సంపన్నురాలు. అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్ ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలోనూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ టాప్‌లో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీనా లగార్డ్ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్(4 వ ర్యాంకు), జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా(5) బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(29), అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్(42) ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 23 మందిలో పర్యావరణ పరిక్షణకోసం గళమెత్తిన స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థంబర్గ్ కూడా ఉన్నారు. ఆమె 100వ స్థానంలో నిలిచారు. -
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు దక్కించుకున్న ఆమో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఈ లిస్ట్‌లో క్వీన్ ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె,సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చారు. న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ కంటే నిర్మలా సీతారామన్ ముందున్నారు. 'ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 34 వ ర్యాంకులో నిలిచారు. క్వీన్ ఎలిజబెత్-2 15 పాయింట్లు క్షీణించి 38వ స్థానం, ఇవాంకా ట్రంప్ 18 ర్యాంకులు పడిపోయి 42 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ మహిళల్లో రోష్ని నాదర్ మల్హోత్రా, 54 వ స్థానంలో నిలవగా, కిరణ్ మజుందార్ షా 65 వ స్థానంలో ఉన్నారు. 61 వ స్థానంలో రిహానా, 66 వ స్థానంలో బెయోన్స్ నోలెస్, 71 వ స్థానంలో టేలర్ స్విఫ్ట్, 81 వ స్థానంలో సెరెనా విలియమ్స్, 90 వ స్థానంలో రీస్ విథర్స్ స్పూన్, స్వీడిష్బాలిక గ్రెటా థన్‌బెర్గ్ 100 వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదిసారి కూడా ఈ జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ (2), నాన్సీ పెలోసి (3), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (4), జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బార్రా (5) మేరీ బార్రా (5), మెలిండా గేట్స్, అబిగైల్ జాన్సన్, అనా ప్యాట్రిసియా బోటిన్, గిన్ని రోమెట్టి, మారిలిన్ హ్యూసన్ మిగిలిన టాప్ 5 స్థానాలను దక్కించుకున్నారు. -
పవర్ఫుల్ లేడీగా మరయమ్
లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్ టైమ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. 2017 ఏడాదికిగానూ ది న్యూయార్క్ టైమ్స్ 11 మంది మహిళల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయగా.. అందులో మరయమ్కు చోటు దక్కింది. తండ్రి షరీఫ్ కుడి భుజంగా వ్యవహరిస్తూ పాక్ రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పించింది. ముఖ్యంగా ఎన్ఏ-120 నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమె చేసిన ప్రచారం గురించి ప్రముఖంగా ప్రచురించింది. ఆ ప్రభావంతోనే ఆ స్థానంలో నవాజ్ భార్య కుల్సుం నవాజ్ ఘన విజయం సాధించారని తెలిపింది. కాగా, పనామా పత్రాల ఆరోపణలతో షరీఫ్ గద్దెదిగి పోగా.. పార్టీ వ్యవహారాలను మరయమ్ చూసుకుంటున్నారు.. ఇక న్యూయార్క్ టైమ్స్ లిస్ట్‌లో ఉన్న మరికొందరు. హెండా అయారి, మార్గొట్ వాల్స్ట్రోమ్, యూ క్సియుహువా, మనాల్ అల్ షరీఫ్, ఎమ్మా మోరానో, ఓలైవ్ యాంగ్, అస్లి ఎర్దోగన్, లెటిజియా బట్టగ్లియా, సింటా నూరియా, అలైస్ స్చ్వార్జర్ ఉన్నారు. -
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళ ఇంద్రా నూయి
51 మందిలో రెండో ర్యాంక్ న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన ‘ప్రపంచపు 51 అతిశక్తివంతమైన మహిళల’ జాబితాలో పెప్సికో సీఈవో, చైర్మన్ ఇంద్రా నూయి స్థానం పొందారు. భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక మహిళగా ఇంద్రా నూయి నిలిచారు. ఈమె రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అగ్రస్థానంలో జనరల్ మోటార్స్ సీఈవో, చైర్మన్ మేరీ బర్రా ఉన్నారు. గతేడాది కూడా ఇంద్రా నూయి రెండవ స్థానంలోనే ఉండటం విశేషం. ఇక 2014లో మూడవ స్థానంలో ఉన్నారు. గడచిన ఏడాది కాలంలో పెప్సికో మార్కెట్ క్యాపిటల్ 18 శాతం పెరుగుదలతో 155 బిలియన్ డాలర్లకి ఎగిసిందని ఫార్చ్యూన్ పేర్కొంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల కారణంగా కంపెనీకి గతేడాది లాభాలు తగ్గినా కూడా మార్కెట్ క్యాపిటల్ పెరగడంలో ఇంద్రా నూయి కీలకపాత్ర పోషించారని కొనియాడింది. ఇన్వెస్టర్లు ఇంద్రా నూయి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొంది. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ వృద్ధితో మేరీ బర్రా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబునిచ్చింది. టాప్-10లోని మహిళలు వీరే.. ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో పలువురు ప్రముఖులు స్థానం పొందారు. కాగా టాప్-10లో.. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో మెరిల్లిన్ హ్యూసన్ (3వ స్థానం), ఐబీఎం సీఈవో గిన్ని రొమెట్టీ (4), ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈవో అబిగెయిల్ (5), ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (6), హ్యూలెట్ పకార్డ్ ఎంటర్ప్రైస్ సీఈవో మెగ్ విత్‌మన్ (7), జనరల్ డైనమిక్స్ సీఈవో ఫెబె నొవాకొవిక్ (8), మాండలిజ్ ఇంటర్నేషనల్ సీఈవో ఐరెన్ రోసెన్ఫీల్డ్ (9), ఒరాకిల్ కో-సీఈవో సఫ్రా కాట్జ్ (10వ స్థానం) ఉన్నారు. -
టాప్-100 మహిళల్లోనలుగురు భారతీయులు
♦ ప్రపంచ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్ ♦ అరుంధతీ భట్టాచార్యకు 25వ స్థానం ♦ చందా కొచర్, కిరణ్ షా, శోభనా భర్తియాకు చోటు న్యూయార్క్: ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. హిందుస్థాన్ టైమ్స్‌ను ప్రచురించే హెచ్‌టీ మీడియాకు శోభన చైర్పర్సన్, ఈడీగా వ్యవహరిస్తున్నారు. జాబితాలో మొట్టమొదటి స్థానంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఉండగా ఆ తరువాతి రెండు స్థానాల్లో వరసగా అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్, ఫెడరల్ రిజర్స్ చీఫ్ జానెట్ యెలెన్ నిలిచారు. ఈ జాబితాలో ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ (7వ స్థానం), మిషెల్ ఒబామా (13), పెప్సికో సీఈవో ఇంద్రా నూయి (14) ఉన్నారు. -
శక్తిమంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నాం
ఇంటర్మీడియట్లో తమ కళాశాల విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని హైదరాబాద్ నగరానికి చెందిన సెయింట్ ఆన్స్ కళాశాల ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 1981లో కేవలం అమ్మాయిల కోసం తమ కాలేజి స్థాపించినప్పటి నుంచి వాళ్లకు కేవలం చదువులోనే కాక, అన్ని రంగాల్లో ముందుండేలా, సమాజంలో శక్తిమంతమైన మహిళలుగా ఎదిగేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈసారి కూడా ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఎంఎల్‌హెచ్‌సీ, హెచ్ఈసీ విద్యార్థినులు మంచి ఫలితాలను సాధించారని చెప్పారు. అలాగే, వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినుల వివరాలను కూడా తెలిపారు. ఎంపీసీ: తజ్బియా ఫాతిమా - 973; సిమ్రన్ - 969 బైపీసీ: ఆకాంక్షా రాజ్ - 974; అనన్యా కుసుమ - 960 ఎంఈసీ: సంస్కృతీ అగర్వాల్ - 965; రేవతి- 958 సీఈసీ: యాస్మీన్ నాజ్ - 942; హెచ్.శ్రీవాణి- 939 ఎంఎల్‌హెచ్‌సీ: జువేరియా షెరీన్ - 872 హెచ్ఈసీ: సైదా సుకైనా హుస్సేన్- 722