కొండచిలువలను ట్రక్కులోకి ఎక్కిస్తున్న గ్రామస్థులు
బొర్నియో ద్వీపం, మలేసియా : నాలుక ఒకసారి రుచి మరిగితే మళ్లీ మళ్లీ దాన్నే తినాలనిపిస్తుంది. పాముల మాంసానికి అలవాటుపడిన ఓ గ్రామ ప్రజలు జత కట్టిన రెండు కొండచిలువలను చంపి, కోసి కూర వండుకున్నారు. ఈ సంఘటన మలేసియాకు చేరువలోని బొర్నియో ద్వీపంలో చోటు చేసుకుంది.
పాముల వేటకు బయల్దేరిన బొర్నియో ద్వీప గ్రామస్థులు.. దగ్గరలో వింత శబ్దం రావడం విన్నారు. కూలిపోయిన చెట్టు దుంగ నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించారు. కొండచిలువ దుంగలో ఉందని అనుమానం రావడంతో.. వెంట తెచ్చుకున్న రంపంతో దుంగను మధ్యలోకి కోశారు.
లోపల 20 మీటర్ల పొడవున్న ఆడ కొండచిలువ, చిన్నదైన మగ కొండచిలువతో జత కట్టి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్థుల గ్రూపులో కొందరు రెండు కొండచిలువలను విడదీసి రోడ్డు మీదకు లాక్కొచ్చారు. అనంతరం తుపాకీలతో రెంటినీ కాల్చి చంపారు.
ట్రక్కులో వాటిని గ్రామానికి తరలించారు. అనంతరం గ్రామంలోని మహిళలు అందరూ కలసి రెండు కొండచిలువలను ముక్కలుగా కోశారు. స్థానిక ఆచారం ప్రకారం.. కొండచిలువలను మంటపై కాల్చారు. కొండచిలువల మాంసంతో పాటు సంప్రదాయ వంటకాలతో కలసి భోజనం చేశారు. ఒక్కసారి వేటకు వెళ్తే వచ్చే పాముల ఆహారంతో కొన్ని రోజుల పాటు గ్రామస్థులు జీవిస్తారని గ్రామ పెద్ద ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment