ప్లాన్ చేసి.. క్యాబ్‌లో రైడ్‌కు తీసుకెళ్లి!
వాషింగ్టన్: భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన ఓ భర్త ప్లాన్ ప్రకారం ఆమెను హత్యచేశాడు. ఈ ఘటన ఆమెరికాలోని సీటెల్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... కామెరాన్ జాన్ ఎస్పీటియా(31), జెన్నిఫర్ ఎస్పీటియా(29) భార్యాభర్తలు స్థానిక సీటెల్‌లో నివాసం ఉంటున్నారు. కామెరాన్ అమెరికా కోస్ట్ గార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి భార్య జెన్నిఫర్‌తో ఆయనకు విభేదాలున్నాయి. ఆమెతో సంసార బంధం కొనసాగకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కామెరాన్ భార్యను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు.
ప్లాన్ ప్రకారం.. రైడ్‌కు వెళ్దామని జెన్నిఫర్‌ను ఒప్పించి ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న కామెరాన్ క్యాబ్ ఎక్కినప్పటినుంచి భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. కొంతసేపయ్యాక క్యాబ్ డ్రైవర్ ఓ పెద్ద శబ్దం విన్నాడు. కారు టైర్ పేలిందేమోనని కంగారుపడి వెనక్కి తిరిగి చూసి షాక్ తిన్నాడు. జెన్నిఫర్ ఆమె సీట్లో నిర్జీవంగా పడి ఉంది. కారు బాగానే ఉన్నా.. తన ప్రాణాలకు ముప్పు ఉందని గమనించిన డ్రైవర్.. ఎక్కడికి వెళ్లాలో చెప్పండి సార్ అని కామెరాన్‌ను అడిగాడు. అతడు చెప్పిన ప్రాంతంలో క్యాబ్ ఆపగా.. భార్య మృతదేహాన్ని దించి, డ్రైవర్‌కు డబ్బులు చెల్లించాడు.
జరిగిన విషయాన్ని ఉబర్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ సమాచారంతో నిందితుడు కామెరాన్ ఇంటికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జెన్నిఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆప్పత్రికి తరలించినట్లు చెప్పారు. భార్యతో శారీరక బంధం కొనసాగడం లేదని, అందువల్లే ఆమెను తుపాకీతో కాల్చి హత్యచేశానని కామెరాన్ అంగీకరించాడు. సోమవారం కామెరాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి నిర్ణయం ప్రకారం మూడు మిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించి బెయిల్‌పై విడుదలయ్యాడు. తదుపరి విచారణ జులై6కు వాయిదా వేశారు. సెకండ్ డిగ్రీ హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.