ఐఎంఎఫ్ ఎండీకి గడ్డు పరిస్థితి | IMF head ordered to face trial over Tapie affair | Sakshi
Sakshi News home page

ఐఎంఎఫ్ ఎండీకి గడ్డు పరిస్థితి

Published Fri, Dec 18 2015 8:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టీన్ లగార్డే విచారణకు హాజరుకావాల్సిందేనని ఫ్రాన్స్ కోర్టు స్పష్టం చేసింది. ప్రజా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే గత కొన్నేళ్లుగా లగార్డేపై ఆరోపణలు నమోదయ్యాయి.

పారిస్: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టీన్ లగార్డే విచారణకు హాజరుకావాల్సిందేనని ఫ్రాన్స్ కోర్టు స్పష్టం చేసింది. ప్రజా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే గత కొన్నేళ్లుగా లగార్డేపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె ఫ్రాన్స్ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో బడా వ్యాపార వేత్త బెర్నార్డ్ తైపీకి 2008లో నిధుల విడుదల విషయంలో అవతవకలు చోటుచేసుకున్నాయని, భారీ మొత్తంలో అవినీతి చోటుచేసుకుందనిఆరోపణలు వచ్చాయి.

దీనిపై ప్రారంభంలో విచారణ పేరిట కొంత హడావిడి జరిగినా తన తరుపున న్యాయవాదుల సహాయంతో కొన్ని విచారణలను ఆమె తప్పించుకున్నారు. తనకు ఏమి తెలియనట్లు ఆ విషయం నుంచి పక్కకు జరిగారు. కానీ, తాజాగా తలెత్తుతున్న వివాదం నేపథ్యంలో లగార్డేను విచారణ చేయాలని కోర్టు నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement