christine lagarde
-
ముకేశ్ అంబానీ మరో ఘనత
-
ముకేశ్ అంబానీ ‘గ్లోబల్ థింకర్’!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో ముకేశ్ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘44.3 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో జాక్ మాను వెనక్కినెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే నంబర్ వన్ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్, రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో ద్వారా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్బుక్, గూగుల్‌లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్ అంబానీ... టాప్–10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు కూడా చోటు లభించింది. -
ప్రధాని మోదీకి చల్లటి కబురు..!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఎంఎంఎఫ్) చల్లటి వార్తను చెప్పింది. యశ్వంత్ సిన్హాలాంటి సొంత నేతలే పెద్దనొట్ల రద్దు, జీఎస్టీపై తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరిమైన దారిలో ప్రమాణిస్తోందని పేర్కొంది. గత త్రైమాసింలో భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసినా.. భవిష్యత్‌లో పుంజుకుంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టినా లెగ్రాడే ఆశాభావం వ్యక్తం చేశారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అనే కొత్త పన్నుల వ్యవస్థ రావడం వల్ల.. వ్యవస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయని.. అందువల్లే వృద్ధిరేటు తక్కువగా నమోదైవుండొచ్చని ఆమె అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అనేవి భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన గాడిలోకి తీసుకెళతానయే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందని ఈ మధ్య ఐఎంఎఫ్ చేసిన నేపథ్యంలో లెగార్డే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది కాలంగా పెనుమార్పులకు లోనైంది. ఈ కారణాలలో వృద్ధి రేటు నమోదలు కొన్ని ఇబ్బందులు ఎదురయి వుంటాయి.. భవిష్యత్‌లో మాత్రం జీఎస్టీ, డిమానిటైజేషన్ ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని శక్తిని చేకూర్చుతాయని ఆమె చెప్పారు. జీఎస్టీ అమలు అనేది ఒక చారిత్రాత్మక ప్రయత్నం. ఆర్థిక వ్యవస్థ గతిని మార్చే బృహత్కార్యం వల్ల తాత్కాలిక ఇబ్బందులు తప్పవు అని ఆమె స్పష్టం చేశారు. -
ట్రంప్‌పై అంతర్జాతీయ సంస్థ చీఫ్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారిగా ఓ అంతర్జాతీయ సంస్థ చీఫ్ నుంచి ప్రశంసలు దక్కాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థకు డోనాల్డ్ ట్రంప్ మంచి చేశాడని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డే అన్నారు. అతడు స్వల్పకాలంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదుట పరిచాడని ఇది మంచి పరిణామం అన్నారు. అయితే, డాలర్‌ను పటిష్టత చర్యలు, వడ్డీ రేట్ల పెంపు అనే అంతర్జాతీయ వర్తక వ్యాపారంపై ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. అమెరికాలో మౌలిక వసతుల ఏర్పాటు రంగంలో రెట్టింపు చేయనున్న పెట్టుబడి సంస్కరణలు, పన్ను సంస్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత బూస్టింగ్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ శిఖరాగ్ర సదస్సులో ఆమె ఈ విషయాలు చెప్పారు. అయితే, ట్రంప్ విదేశాంగ విధానాల జోలికి మాత్రం ఆమె వెళ్లలేదు. -
భారత్ ఓ కాంతిపుంజం
♦ బలమైన వృద్ధి దిశగా వర్ధమాన దేశాలు ♦ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే వాషింగ్టన్: బలమైన వృద్ధి, ఆదాయం పెరుగుదల వంటి అంశాల కారణంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో భారత్ ఒక కాంతిపుంజంలా దూసుకె ళ్తోందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, కమోడిటీ ధరల తగ్గుదల, చాలా దేశాల్లో ద్రవ్య సంకట పరిస్థితులు ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాలు బలహీనంగా మారాయని వివరించారు. అయితే వర్ధమాన దే శాలు బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పుంజుకోవాల్సి ఉందని, కానీ అలా జరగడం లేదని అభిప్రాయపడ్డా రు. ఆమె జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని గోతే యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. బ్రెజిల్, రష్యాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని లగార్డే చెప్పారు. ముడి చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో మధ్యతూర్పు ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు, తక్కువ ఆదాయమున్న దేశాలు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలి పారు. కానీ భారత్ మాత్రం వీటికి భిన్నంగా బల మైన వృద్ధితో ముందుకు దూసుకె ళ్తోందని పేర్కొన్నా రు. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆసియా దేశాలు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయని తెలిపారు. వృద్ధి చోదక పాలసీలే లక్ష్యంగా చాలా దేశాలు వృద్ధికి దోహదపడే పాలసీల రూపకల్పనకు ప్రాధాన్యమిస్తున్నాయని లగార్డే అభిప్రాయపడ్డారు. ఆదాయ వ్యయాల ప్రాధాన్యతలను మార్చడం వల్ల దీన్ని సాధించవచ్చని చెప్పారు. భారత్ ఎనర్జీ సబ్సిడీలపై వ్యయాలను తగ్గించుకుందని, ఇక్కడ మిగిలిన నిధులను వృద్ధికి దోహదపడే ఇన్ఫ్రా రంగంలో ఇన్వెస్ట్ చేసే అవకాశముందని వివరించారు. జపాన్ పిల్లల సంరక్షణపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోందని, దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాధాన్యం పెరిగి, తద్వారా రానున్న కాలంలో ఆ దేశంలో వృద్ధి ఎగసే అవకాశముందని పేర్కొన్నారు. -
ఐఎంఎఫ్ ఎండీకి గడ్డు పరిస్థితి
పారిస్: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టీన్ లగార్డే విచారణకు హాజరుకావాల్సిందేనని ఫ్రాన్స్ కోర్టు స్పష్టం చేసింది. ప్రజా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే గత కొన్నేళ్లుగా లగార్డేపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె ఫ్రాన్స్ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో బడా వ్యాపార వేత్త బెర్నార్డ్ తైపీకి 2008లో నిధుల విడుదల విషయంలో అవతవకలు చోటుచేసుకున్నాయని, భారీ మొత్తంలో అవినీతి చోటుచేసుకుందనిఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రారంభంలో విచారణ పేరిట కొంత హడావిడి జరిగినా తన తరుపున న్యాయవాదుల సహాయంతో కొన్ని విచారణలను ఆమె తప్పించుకున్నారు. తనకు ఏమి తెలియనట్లు ఆ విషయం నుంచి పక్కకు జరిగారు. కానీ, తాజాగా తలెత్తుతున్న వివాదం నేపథ్యంలో లగార్డేను విచారణ చేయాలని కోర్టు నిర్ణయించింది.