బాలుడిపై లైంగిక దాడి.. ఇండియన్ కోచ్ కు జైలు.. | Indian football coach jailed for sexually abusing boy in UAE | Sakshi
Sakshi News home page

బాలుడిపై లైంగిక దాడి.. ఇండియన్ కోచ్ కు జైలు..

Published Thu, May 26 2016 4:15 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

బాలుడిపై లైంగిక దాడి.. ఇండియన్ కోచ్ కు జైలు.. - Sakshi

బాలుడిపై లైంగిక దాడి.. ఇండియన్ కోచ్ కు జైలు..

దుబాయ్: కోచింగ్ కోసం వచ్చిన ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫుట్ బాల్ కోచ్ కు మూడేళ్ల జైలుశిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ కు చెందిన విద్యార్థి గతేదాడి ఫేస్ బుక్ లో పరిచయమైన దేశానికే చెందిన కోచ్ ను కలుసుకున్నాడు. తనకు ఫుట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని అడిగితే అంగీకరించాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మైదానంలో శిక్షణ ఇచ్చేవాడు. కొన్ని నెలల నుంచి బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. టీనేజర్ న్యూడ్ గా ఉన్న సమయంలో ఫొటోలు తీశాడు. తనతో సెక్స్ లో పాల్గొనాలని బాలుడిని ఒత్తిడికి గురిచేస్తున్నాడు. అందుకు ఆ కుర్రాడు అంగీకరించకపోవడంతో అతడిపై కోచ్ కక్ష్య పెంచుకున్నాడు. ఫొటోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

తనతో పాటు మరికొంత మంది విద్యార్థులతో అదేతీరుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గతంలో కూడా కోచ్ ప్రవర్తన ఇదే రీతిగా ఉండేదని తనకు ఈ మధ్యే తెలిసిందని అప్పటినుంచి అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించాడు. తాను పిలిచినప్పుడు వచ్చి లైంగిక చర్యలు జరపాలని, లేనిపక్షంలో తాను మొబైల్ ఫోన్లో తీసిన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు కోచ్ ను సంప్రదించి అతడి మొబైల్ తీసుకుని చూడగా అసభ్యకర ఫొటోలు ఉన్నాయని, దీంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టగా టీనేజర్స్ ను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసినందుకు ఫుట్ బాల్ కోచ్ కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక కోర్టులో తీర్పు వెలువడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement