అమెరికా బాంబుతో మాకేం కాలేదు: ఐసిస్‌ | IS denies suffering casualties from US bomb | Sakshi
Sakshi News home page

అమెరికా బాంబుతో మాకేం కాలేదు: ఐసిస్‌

Published Fri, Apr 14 2017 9:05 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

అమెరికా బాంబుతో మాకేం కాలేదు: ఐసిస్‌

అమెరికా బాంబుతో మాకేం కాలేదు: ఐసిస్‌

కైరో: అమెరికా తాజా బాంబుదాడితో తమకు ఎలాంటి నష్టం సంభవించలేదని ఇస్లామిక్‌ స్టేట్‌ స్పష్టం చేసింది. తాము ప్రయోగించిన అతిపెద్ద బాంబు ఏజీబీయూ-43బీ(ఎంవోఏబీ)తో పెద్ద మొత్తంలో ఐసిస్‌ ఉగ్రవాదులు చనిపోయారని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన ఈ బాంబు దాడిలో అప్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్‌ ప్రావిన్నస్‌లోగల అచ్చిన్‌ జిల్లాలో తలదాచుకున్న ఉగ్రవాదులకు పెద్ద మొత్తంలో ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంది.

అయితే, దీనికి సంబంధించి శుక్రవారం అధికార ప్రకటన విడుదల చేసిన ఐసిస్‌ తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ప్రాణం పోలేదని తెలిపింది. ఐసిస్‌ అధికారిక మీడియా తమాక్‌ ద్వారా ఈ విషయం చెబుతూ‘నిన్న అమెరికా దాడిలో ఒక్క మరణం సంభవించలేదు.. ఒక్కరు గాయపడలేదు’ అంటూ ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాల్లో కూడా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement