ఆ బాంబు ఢిల్లీలో పడితే పరిస్థితేమిటి?
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద న్యూక్లియేతర బాంబు జీబీయూ-43/బీ ఎంఓఏబీని ప్రయోగించిన విషయం తెలిసిందే. దీని దాడిలో దాదాపు 36మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్నస్లోని అచ్చిన్ జిల్లాలో ఈ బాంబును ఎంసీ-130 హెర్కులస్ యుద్ధ విమానం ద్వారా ఈ బాంబును జార విడిచింది. ఒక్కసారి దీనిసామర్థ్యం గురించి తెలుసుకుంటే దీని నిర్మాణానికి 16 మిలియన్ల డాలర్ల వ్యయం అవుతుంది. 21,600 పౌండ్లు ఉంటుంది. ప్రత్యేక యుద్ధ విమానం ద్వారా దీనిని జారవిడుస్తారు.
ఈ బాంబును గాల్లోనే పేలిస్తే దాని రేడియేషన్ ప్రభావం 44 మీటర్లు ఉంటుందని, ఇక థర్మల్ రేడియేషన్ గమనిస్తే 110 మీట్లర్ల వరకు భస్మం చేసే శక్తి ఉంటుందని అమెరికా న్యూక్లియర్, న్యూక్లియేతర బాంబుల విశ్లేషకుడు అలెక్స్ వాలర్స్టీన్ చెబుతున్నారు. ఒక వేళ ఈ జీబీయూ-43/బీ ఎంఓఏబీని ఢిల్లీలోని సెంట్రల్ పార్క్, కానౌట్ ప్రాంతంలో పడినట్లుగా భావిస్తే ఆ సమయంలో దాడి ప్రాంతానికి 300 మీటర్ల దూరంగానీ, 4 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్లోగానీ ఉండి ఉంటే ప్రాణాలతో బయట పడొచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న జనాభా దృష్ట్యా దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందట. దాదాపు, 2,050 మంది మృత్యువాత పడతారని, 5,700మంది గాయపడతారని ఒక అంచనా వేస్తున్నారు.