ఆ బాంబు ఢిల్లీలో పడితే పరిస్థితేమిటి? | What Will Happen if The 'Mother of All Bombs' Drops in Delhi? | Sakshi
Sakshi News home page

ఆ బాంబు ఢిల్లీలో పడితే పరిస్థితేమిటి?

Published Fri, Apr 14 2017 4:03 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ఆ బాంబు ఢిల్లీలో పడితే పరిస్థితేమిటి? - Sakshi

ఆ బాంబు ఢిల్లీలో పడితే పరిస్థితేమిటి?

న్యూఢిల్లీ: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద న్యూక్లియేతర బాంబు జీబీయూ-43/బీ ఎంఓఏబీని ప్రయోగించిన విషయం తెలిసిందే. దీని దాడిలో దాదాపు 36మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్‌ ప్రావిన్నస్‌లోని అచ్చిన్‌ జిల్లాలో ఈ బాంబును ఎంసీ-130 హెర్కులస్‌ యుద్ధ విమానం ద్వారా ఈ బాంబును జార విడిచింది. ఒక్కసారి దీనిసామర్థ్యం గురించి తెలుసుకుంటే దీని నిర్మాణానికి 16 మిలియన్ల డాలర్ల వ్యయం అవుతుంది. 21,600 పౌండ్లు ఉంటుంది. ప్రత్యేక యుద్ధ విమానం ద్వారా దీనిని జారవిడుస్తారు.

ఈ బాంబును గాల్లోనే పేలిస్తే దాని రేడియేషన్‌ ప్రభావం 44 మీటర్లు ఉంటుందని, ఇక థర్మల్‌ రేడియేషన్‌ గమనిస్తే 110 మీట్లర్ల వరకు భస్మం చేసే శక్తి ఉంటుందని అమెరికా న్యూక్లియర్‌, న్యూక్లియేతర బాంబుల విశ్లేషకుడు అలెక్స్‌ వాలర్‌స్టీన్‌ చెబుతున్నారు. ఒక వేళ ఈ జీబీయూ-43/బీ ఎంఓఏబీని ఢిల్లీలోని సెంట్రల్‌ పార్క్‌, కానౌట్‌ ప్రాంతంలో పడినట్లుగా భావిస్తే ఆ సమయంలో దాడి ప్రాంతానికి 300 మీటర్ల దూరంగానీ, 4 నిమిషాల వాకింగ్‌ డిస్టెన్స్‌లోగానీ ఉండి ఉంటే ప్రాణాలతో బయట పడొచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న జనాభా దృష్ట్యా దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందట. దాదాపు, 2,050 మంది మృత్యువాత పడతారని, 5,700మంది గాయపడతారని ఒక అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement