mother of all bombs
-
అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్!
బీజింగ్ : అమెరికా ప్రయోగించిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించినట్లు తెలుస్తోంది. హెచ్- 6కె అనే బాంబర్ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు... ‘చైనా అమ్ములపొదిలో ఉన్న అతి శక్తిమంతమైన బాంబు చేరింది. దీనికి మదర్ ఆఫ్ ఆల్‌బాంబ్స్ అని నామకరణం చేశారు. చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి అత్యధిక స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు’ అని ట్వీట్ చేసింది. కాగా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా చైనా చెప్పుకొంటున్న ఈ బాంబును పరీక్షించిన వీడియోను.. ఆ దేశ రక్షణ సంస్థ నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ ) తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. తద్వారా తమ వద్ద కూడా అణు బాంబులకు ప్రత్యామ్నాయ, అత్యంత శక్తిమంతమైన బాంబులు ఉన్నాయని చైనా.. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. హెచ్-6కె అనే బాంబర్ ద్వారా దీనిని ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. అమెరికా రూపొందించిన బాంబు కంటే తాము రూపొందించిన ఈ బాంబు అత్యంత చిన్నది, తేలికైనదని, దీనిని మోసుకువెళ్లేందుకు పెద్ద పెద్ద ఎయిర్‌క్రాఫ్టులు అక్కర్లేదని తెలిపారు. ఇక అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా సైన్యం.. గతేడాది జీబీయూ-43/బి అనే బాంబును ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే పేరు పెట్టారు. ఈ క్రమంలో చైనా కూడా తమ కొత్త బాంబుకు అదే పేరు పెట్టి.. అగ్రరాజ్యానికి సవాల్ విసిరింది. కాగా రష్యా కూడా ఇటువంటి బాంబునే తయారు చేసి దానికి ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా నామకరణం చేసింది. అత్యంత పెద్దది, థర్మోబరిక్ అయిన ఈ బాంబు గ్యాస్‌ను ఉపయోగించుకుని... పెద్ద పెద్ద ఫైర్‌బాల్స్‌ను విసరడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అయితే చైనా రూపొందించిన బాంబు మాత్రం థర్మోబరిక్ బాంబు కాదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. China's arms industry giant NORINCO for the first time showcased a new type of massive aerial bomb, which it dubbed the Chinese version of the "Mother of All Bombs" due to its huge destruction potential that is claimed to be only second to nuclear weapons. https://t.co/Xwa470K0R5 pic.twitter.com/bWDvmfvcyk — Global Times (@globaltimesnews) January 3, 2019 -
విడిచిపెడితే విధ్వంసమే... !
బీజింగ్: పొరుగుదేశమైన చైనా పెను విధ్వంసం సృష్టించే బాంబును అభివృద్ధి చేసింది. ఇది అమెరికా ఇప్పటికే తయారుచేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే శక్తిమంతమైనది గమనార్హం. ఈ బాంబు అత్యంత శక్తిమంతమైనదని డ్రాగన్ అధికారిక మీడియా శుక్రవారం పేర్కొంది. ఈ అణుఇంధనేతర బాంబును చైనా రక్షణ ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థ అయిన నొరిన్కో తొలిసారిగా ప్రదర్శించింది. దీనిని చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్‌గా అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ఇది నిమిషాల వ్యవధిలో సర్వం నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. అణ్వాయుధాల తర్వాతి స్థానం దీనికే దక్కుతుంది. హెచ్–6కే బాంబర్ సహాయంతో దీనిని గగనతలం నుంచి ప్రయోగాత్మకంగా విడిచిపెట్టారు. దీంతో అది భారీ విధ్వంసం సృష్టించింది. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోని నొరిన్కో మీడియాకు విడుదల చేసింది. గత నెలలో ఈ బాంబును పరీక్షించినట్టు నొరిన్కో తన వెబ్సైట్లో పేర్కొంది. బాంబు సృష్టించిన విధ్వంసం తాలూకు దృశ్యాలను బహిరంగం చేయడం మాత్రం ఇదే తొలిసారని చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. ఉగ్రవాదులపై ప్రయోగించిన అమెరికా మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ (ఎంఓఏబీ) ఆయుధంగా పిలుచుకునే జీబీయూ–43 బీ బాంబుతో అమెరికా సైన్యం గత సంవత్సరం అఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. అఫ్ఘనిస్థాన్‌లో కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల అంతమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతుండడం తెలిసిందే. ఇది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. చైనా కూడా అదే ముద్దుపేరును తన బాంబుకు వాడుకుంటోంది. ఈ బాంబు అనేక టన్నుల బరువు ఉంటుందని, అమెరికా వద్ద ఉన్న బాంబుతో పోలిస్తే చైనా తయారుచేసిన బాంబు చిన్నదిగానే, తేలికగాను ఉంటుంది. ఇది ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు ఉంటుంది. ఎంత అధునాతనంగా నిర్మించిన కోటలుగాని, భూఉపరితల లక్ష్యాలనుగానీ, రక్షణ స్థావరాలనుగానీ ఈ బాంబు సమూలంగా తుడిచిపెడుతుంది. అయితే అమెరికా తయారుచేసిన బాంబు చైనా బాంబు కంటే పెద్దది కావడంతో దానిని తరలించడానికి భారీ రవాణా విమానాలే తప్ప మరో మార్గం లేదు. హెచ్–6కే జెట్ విమానాలు మాత్రమే దీనిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించగలుగుతాయి. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మరోవైపు అమెరికా దాడులకు పాల్పడితే ధీటుగా తిప్పికొట్టేందుకు రష్యా కూడా మరో భారీ బాంబును తయారుచేసింది. దీనిని అది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ముద్దుగా పిలుచుకుంటోంది. ఇది చైనా, అమెరికా బాంబుల కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. -
‘ఏం జరుగుతోంది? బాంబుకు అమ్మ పేరేంటి?’
మిలాన్: అమెరికాను పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. బాంబులకు తల్లి పేరు పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. విధ్వంసాలు సృష్టించే బాంబులను వర్ణించేందుకు అమ్మ అనే పదాన్ని ఉపయోగించరాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోని అన్ని బాంబులకు తల్లి(మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్)గా పేర్కొంటూ అమెరికా ఓ పెద్ద బాంబును సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ప్రపంచ బాంబులకు తండ్రిలాంటి బాంబు(ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్) రష్యా వద్ద ఉందంటూ చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన పోప్.. పేలుడు పదార్థాన్ని తల్లి పేరుతో వర్ణించరాదని అన్నారు. ‘ఆ పేరు నేను విన్నప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది. తల్లి జన్మనిస్తుంది. బాంబు మాత్రం చావునిస్తుంది. అయినా దీనిని తల్లిగా పిలుస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న పోప్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఐసిస్ అబద్ధం.. యూఎస్ దాడితో భారీ నష్టమే
న్యూయార్క్: అమెరికా అతిపెద్ద బాంబుతో చేసిన దాడి వృధా కాలేదని స్పష్టమైంది. దాదాపు 90 మందికిపైగా ఉగ్రవాదులు ఈ బాంబు దాడిలో హతమయ్యారని అప్ఘనిస్థాన్ ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఇస్లామిక్ స్టేట్ దెబ్బతిందని కూడా పేర్కొంది. అమెరికాలోని అతిపెద్ద బాంబుగా పేర్కొన్న జీబీయూ-43/బీ (ఎంఓఏబీ)ని అప్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్స్‌లోగల ఐసిస్ సొరంగ బంకర్లపై వేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తొలుత వార్తలు రాగా.. అసలు తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దీంతో అమెరికా ప్రయత్నం విఫలమైందా అని మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాంబు దాడికి సంబంధించి తాజాగ అఫ్ఘనిస్థాన్ అధికారిక ప్రతినిధి అచ్చిన్ జిల్లా గవర్నర్ ఇస్మాయిల్ షిన్వారి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 92మంది ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. అయితే, ఈ దాడిలో తమ సైనికులకుగానీ, సామాన్యులకు గానీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అయితే, గతంలో ఈ బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సామాన్య పౌరులు కూడా ఉండేవారని, ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిణామాల కారణంగా వారంతా ఆ ప్రాంతాలను విడిచి వెళ్లారని వివరించారు. ఈ కారణంగానే పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అభిప్రాయపడ్డారు. -
భారీ బాంబు లక్ష్యమేంటి?
వ్యాసార్ధం ఒక మీటరు, పొడవు 9 మీటర్లు.. బరువు 10,251 కిలోలు! అఫ్గాన్‌లోని నంగర్హర్లో ఐఎస్ సొరంగాలపై అమెరికా వేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ విశేషాలివి. అయితే ఇంత శక్తిమంతమైన బాంబును ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో లేని అఫ్గాన్‌లో ఎందుకు వేశారని యుద్ధనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అఫ్ఘాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు 800 మందికి మించి లేరని అంటున్నారు. అంతేకాకుండా పెద్దగా ప్రభావం చూపలేని కొండగుహల ప్రాంతంలో ఆ బాంబును ఎందుకు వేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్’(ఎంఓఏబీ)గానూ పిలిచే ఈ బాంబు అణు బాంబు కాదు. ఇందులో 8,482 కిలోల పేలుడుపదార్థాన్ని కూర్చారు. జీపీఎస్ ఆధారిత ఎంఓఏబీ భూమికి 1.8 మీటర్ల ఎత్తులో ఉండగానే పేలిపోతుంది. దీంతో పేలుడు శక్తి నలుదిశలా విస్తరించి నష్టం ఎక్కువ కలుగుజేస్తుంది. ఇది గుహల్లోకి చొచ్చుకెళ్లేది కాదు. కొండలను తొలిచి స్థావరాలను ఏర్పాటు చేసుకునేటపుడు సూటిగా ఒకే మార్గం తవ్వరు. మార్గాలు పలు మలుపులు తిప్పుతారు. కాబట్టి నంగర్హర్లో గుహలన్నీ ధ్వంసమయ్యాయని చెప్పడానికి లేదు. బొరియల్లో దాక్కున్న వారిపై దాడులు చేసేటపుడు గుహద్వారాలు లక్ష్యంగా బాంబులు కురిపిస్తుంటారు. అందుకే అప్పట్లో తోరాబోరా గుహల్లో బిన్ లాడెన్ ఉన్నాడని తెలిసినా అమెరికా ఈ బాంబును వాడలేదు. ఇటీవల సిరియాలోని షయరత్ ఎయిర్‌బేస్‌పై అమెరికా 59 తొమహక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 34 క్షిపణులను రష్యా రక్షణ వ్యవస్థ సాయంతో సిరియా కూల్చేసింది. దీంతో సిరియా, ఇరాక్‌లలోని ఐఎస్ మిలిటెంట్లను భయపెట్టడానికి అమెరికా బలప్రదర్శన కోసం ఎంఓఏబీని వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దాడిలో 36 మంది హతం మృతుల్లో కేరళవాసి! కాబూల్: అఫ్గానిస్తాన్‌లో గురువారం అమెరికా చేసిన భారీ బాంబు దాడిలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్గాన్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక కేరళ వాసి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నంగర్హర్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో అమెరికా వాయుసేన ఐసిస్ సొరంగాల సముదాయంపై వేసిన 11 టన్నుల ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ధాటికి పలు ఐసిస్ గుహలు, మందుగుండు సామగ్రి ధ్వంసమైంది. ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టమూ వాటిల్లేదన్నారు. కాగా, దాడిలో తమ మిలిటెంట్లెవరూ చనిపోలేదని ఐఎస్ ప్రకటించింది. దాడి మృతుల్లో కేరళ కాసర్గోడ్ జిల్లా పద్నా గ్రామానికి చెందిన ఐసిస్ మిలిటెంట్ ముర్షీద్ ఉన్నట్లు తనకు టెలిగ్రామ్ ద్వారా సమాచారం అందిందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత అబ్దుర్ రహిమాన్ తెలిపారు. కాగా, ‘మా సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. ఇది మరో విజయం. గత 8 వారాల్లో ఏం జరిగిందో చూస్తే గత ఎనిమిదేళ్ల జరిగినదానికి, ఇప్పటికి తేడా ఏమిటో తెలుస్తుంది’ అని వైట్‌హౌస్‌లో విలేకర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికాకు తగిన బదులిస్తాం’ ప్యాంగ్యాంగ్: అమెరికా రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలకు నిర్ధాక్షిణ్యంగా బదులిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. అణు పరీక్షలపై ఉత్తరకొరియా ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలా స్పందించింది. కొరియా ద్వీపకల్పానికి అణు సామర్థ్యం ఉన్న విమానాలు ఎంత దగ్గరగా వస్తే అంతే కనికరం లేకుండా తామూ దాడులు చేస్తామని పేర్కొంది. కాగా, ఆరోసారి అణు పరీక్షలు చేస్తామన్న ఉత్తరకొరియా ప్రకటన పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఉత్తర కొరియా అణు పరీక్షలు జరిపితే ఆ దేశంపై ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవాలనే దానిపై యోచిస్తున్నామని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. -
అమెరికా బాంబుతో మాకేం కాలేదు: ఐసిస్
కైరో: అమెరికా తాజా బాంబుదాడితో తమకు ఎలాంటి నష్టం సంభవించలేదని ఇస్లామిక్ స్టేట్ స్పష్టం చేసింది. తాము ప్రయోగించిన అతిపెద్ద బాంబు ఏజీబీయూ-43బీ(ఎంవోఏబీ)తో పెద్ద మొత్తంలో ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయారని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన ఈ బాంబు దాడిలో అప్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్నస్‌లోగల అచ్చిన్ జిల్లాలో తలదాచుకున్న ఉగ్రవాదులకు పెద్ద మొత్తంలో ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంది. అయితే, దీనికి సంబంధించి శుక్రవారం అధికార ప్రకటన విడుదల చేసిన ఐసిస్ తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ప్రాణం పోలేదని తెలిపింది. ఐసిస్ అధికారిక మీడియా తమాక్ ద్వారా ఈ విషయం చెబుతూ‘నిన్న అమెరికా దాడిలో ఒక్క మరణం సంభవించలేదు.. ఒక్కరు గాయపడలేదు’ అంటూ ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాల్లో కూడా చెప్పింది. -
ఆ బాంబు ఢిల్లీలో పడితే పరిస్థితేమిటి?
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద న్యూక్లియేతర బాంబు జీబీయూ-43/బీ ఎంఓఏబీని ప్రయోగించిన విషయం తెలిసిందే. దీని దాడిలో దాదాపు 36మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్నస్లోని అచ్చిన్ జిల్లాలో ఈ బాంబును ఎంసీ-130 హెర్కులస్ యుద్ధ విమానం ద్వారా ఈ బాంబును జార విడిచింది. ఒక్కసారి దీనిసామర్థ్యం గురించి తెలుసుకుంటే దీని నిర్మాణానికి 16 మిలియన్ల డాలర్ల వ్యయం అవుతుంది. 21,600 పౌండ్లు ఉంటుంది. ప్రత్యేక యుద్ధ విమానం ద్వారా దీనిని జారవిడుస్తారు. ఈ బాంబును గాల్లోనే పేలిస్తే దాని రేడియేషన్ ప్రభావం 44 మీటర్లు ఉంటుందని, ఇక థర్మల్ రేడియేషన్ గమనిస్తే 110 మీట్లర్ల వరకు భస్మం చేసే శక్తి ఉంటుందని అమెరికా న్యూక్లియర్, న్యూక్లియేతర బాంబుల విశ్లేషకుడు అలెక్స్ వాలర్స్టీన్ చెబుతున్నారు. ఒక వేళ ఈ జీబీయూ-43/బీ ఎంఓఏబీని ఢిల్లీలోని సెంట్రల్ పార్క్, కానౌట్ ప్రాంతంలో పడినట్లుగా భావిస్తే ఆ సమయంలో దాడి ప్రాంతానికి 300 మీటర్ల దూరంగానీ, 4 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్లోగానీ ఉండి ఉంటే ప్రాణాలతో బయట పడొచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న జనాభా దృష్ట్యా దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందట. దాదాపు, 2,050 మంది మృత్యువాత పడతారని, 5,700మంది గాయపడతారని ఒక అంచనా వేస్తున్నారు.