
వైమానిక దాడిలో ఐసిస్ ఉగ్రవాదికి గాయాలు
ఫిలిప్పీన్స్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఐసిస్ ఉగ్రవాది గాయపడ్డాడు.
మనీలా: ఫిలిప్పీన్స్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఇస్నిలొన్ హపిలోన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు ఫిలిప్పీన్స్ డిఫెన్స్ సెక్రెటరీ డెల్ఫిన్ లొరెంజానా ఒక ప్రకటన చేశారు.
ఇస్నిలొన్ హపిలొన్ గతంలో ముగ్గురు అమెరికన్లను ఫిలిప్పీన్స్‌లో కిడ్నాప్ చేశాడు. దీంతో అతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా.. అతడిపై 5 మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది. హపిలోన్ను ఆగ్నేయాసియాలో కీలక సభ్యుడిగా ఇస్లామిక్ స్టేట్ గుర్తించింది.