వాషింగ్టన్: ప్రాణాంతక వైరస్ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలో భాగంగా పలు దేశాల్లో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతోంది. అగ్రరాజ్యం మొదలు అన్ని దేశాల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగా వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లలో చైతన్యం నింపుతున్నారు. యోగాతో ఫిట్‌నెస్ పెంచుకోవచ్చని.. మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తాజాగా యోగ నిద్రకు సంబంధించిన వీడియోను మోదీ పోస్ట్ చేశారు.
‘‘సమయం దొరికినపుడు... వారానికి ఒకటి లేదా రెండుసార్లు యోగ నిద్ర ప్రాక్టీసు చేస్తాను. తద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇంటర్‌నెట్‌లో మరిన్ని యోగ నిద్ర వీడియోలు మీకు లభిస్తాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న వీడియోను షేర్ చేస్తున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ కూడా స్పందించారు. ఇది అద్భుతం అంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గతేడాది ప్రధాని మోదీ.. యానిమేటెడ్ వర్షన్ వీడియోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా కరోనా అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఇవాంక మహమ్మారిని అంతా కలిసి తరిమికొడదాం అంటూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
This is wonderful! Thank you @narendramodi!#TogetherApart https://t.co/k52G4viwDs
— Ivanka Trump (@IvankaTrump) March 31, 2020
Comments
Please login to add a commentAdd a comment